ఓట్ల తొలగింపు అంశంతో జగన్ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వివేకానందరెడ్డి ఓటును తొలగించింది వైఎస్ జగనేనని ఆరోపించారు. వివేకా ఓటు తొలగించి జగన్‌ లబ్ధి పొందాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. జగన్‌కు ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి ఓటు వేస్తారనే నమ్మకం లేదని అందువల్లే ఓటు తొలగించారన్నారు. 

అమరావతి: ఏపీలో ఓట్ల తొలగింపు అంశం ఏపీ రాజకీయాల్లో సెగలు రేపుతోంది. టీడీపీ ఓట్లు తొలగించేందుకు కుట్రలు పన్నుతుందని వైసీపీ ఆరోపిస్తుంటే....ఓడిపోతామనే భయంతో వైసీపీ ఫోరం7తో ఓట్లు తొలగించాలని వైసీపీ కుట్ర పన్నుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. 

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి ఓటు గల్లంతుపై వైఎస్ జగన్ నెల్లూరు సమరశంఖారాం సభలో ప్రస్తావించారు. తన సొంత చిన్నాన్న ఓటును కూడా టీడీపీ తొలగించిందని ఆరోపించారు. వైఎస్ జగన్ వ్యాక్యలపై టీడీపీ నేత సతీష్ రెడ్డి తీవ్ర వ్యాక్యలు చేశారు. 

ఓట్ల తొలగింపు అంశంతో జగన్ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వివేకానందరెడ్డి ఓటును తొలగించింది వైఎస్ జగనేనని ఆరోపించారు. వివేకా ఓటు తొలగించి జగన్‌ లబ్ధి పొందాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. జగన్‌కు ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి ఓటు వేస్తారనే నమ్మకం లేదని అందువల్లే ఓటు తొలగించారన్నారు. 

ఫారం 7 ద్వారా ప్రజల ఓట్లు తొలగించమని చెప్పడానికి జగన్ ఎవరని నిలదీశారు. జగన్ వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించాలని సతీష్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీలో దాదాపుగా 59వేలకు పైచిలుకు ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని వాటిని తొలగించాలంటూ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈసీని కూడా కలిశారు. జగన్ 54 లక్షల ఓట్లు తొలగించాలని కుట్రపన్నారని టీడీపీ ఆరోపించిన విషయం తెలిసిందే.