వారు చేసిన అవినీతి వారిని వెంటాడుతూనే ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎంతలా అవినీతి చేశారో వారికి కూడా తెలుసునన్నారు. కుటుంబ పాలన కోసం వ్యవస్థలను నాశనం చేశారంటూ ఆరోపించారు. తమ ప్రభుత్వం నీతి నిజాయితీగా పనిచేస్తుందని అందువల్ల తాము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ప్రధాని నరేంద్రమోదీ. పాపం చేసేవాళ్లే భయపడతారని తాను భయపడేది లేదని మోదీ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యమేవ జయతే బహిరంగ సభలో పాల్గొన్న మోదీ చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
ఏదైనా హామీని అమలు చెయ్యాలంటే ఇక్కడ కొందరు నేతలులా తాము భయపడమన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెనక వచ్చి తమ ఫైళ్లు తెరుస్తారనో లేకపోతే మా అవినీతి బయటపడుతుందన్న భయం లేదన్నారు. తాము ఏదైనా నిర్ణయం తీసుకున్నామంటే అది ధృఢంగా ఉంటుందన్నారు. కానీ ఇక్కడ ఉన్న నేతలు మాత్రం భయపడాలన్నారు.
వారు చేసిన అవినీతి వారిని వెంటాడుతూనే ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎంతలా అవినీతి చేశారో వారికి కూడా తెలుసునన్నారు. కుటుంబ పాలన కోసం వ్యవస్థలను నాశనం చేశారంటూ ఆరోపించారు. తమ ప్రభుత్వం నీతి నిజాయితీగా పనిచేస్తుందని అందువల్ల తాము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కొందరు పగలు రాత్రి అనే తేడా లేకుండా తనను తిడుతున్నారంటూ ధ్వజమెత్తారు. అలాంటి వారికి ప్రజలు సరైన సమయంలో బుద్ది చెప్తారంటూ ప్రధాని నరేంద్రమోదీ చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
యూటర్న్ సీఎం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు: మోదీ
దశాబ్ధాల కల నెరవేర్చా, కావాలనే కొందరు అసత్య ప్రచారం: చంద్రబాబుపై మోడీవ్యాఖ్యలు
ప్రపంచమంతా భారత్ వెంట, మీవి పాక్ కు అనుకూలమైన మాటలు: బాబుపై మోదీ ఫైర్