Asianet News TeluguAsianet News Telugu

యూటర్న్ సీఎం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు: మోదీ

ఒక్క మాటపై నిలబడలేని వ్యక్తి విశాఖపట్నం జిల్లా అభివృద్ధికి పాటుపడతారా అంటూ నిలదీశారు. ఉత్తరాంధ్ర, ఏపీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. యూటర్న్ లు తీసుకున్న నాయకుడు ఏయే పార్టీలతో కూటమి కట్టారో అర్థం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీతో జతకట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టారని మోదీ ఆరోపించారు. 

pm modi says chandrababu naidu as u turn cm
Author
Visakhapatnam, First Published Mar 1, 2019, 7:54 PM IST

విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రధాని నరేంద్రమోదీ నిప్పులు చెరిగారు. దేశంలో చంద్రబాబులా ఏ నాయకుడు అన్ని యూటర్న్ లు తీసుకోలేదని విమర్శించారు. విశాఖపట్నంలో సత్యమేవ జయతే బహిరంగ సభలో పాల్గొన్న మోదీ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు తనపై విమర్శలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

ఒక్క మాటపై నిలబడలేని వ్యక్తి విశాఖపట్నం జిల్లా అభివృద్ధికి పాటుపడతారా అంటూ నిలదీశారు. ఉత్తరాంధ్ర, ఏపీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. యూటర్న్ లు తీసుకున్న నాయకుడు ఏయే పార్టీలతో కూటమి కట్టారో అర్థం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీతో జతకట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టారని మోదీ ఆరోపించారు. 

పేదప్రజల పక్షాన పనిచేస్తున్నందుకా లేక నల్లధనాన్ని బయటపెడతానన్న భయంతో తనను పదవీ విచ్యుతుడిని చెయ్యాలనుకుంటున్నారా అని నిలదీశారు. నల్లధనం వెలికితీస్తున్నాననే తనపై కుట్రపన్నుతున్నారంటూ ఆరోపించారు. 

నవభారత నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న నరేంద్ర మోదీని పదవీచిత్యుడిని చెయ్యాలని మహాకూటమి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశ ప్రజలకు మంచి పాలన అందించడమే తన లక్ష్యమన్నారు ప్రధాని నరేంద్రమోదీ.  

ఈ వార్తలు కూడా చదవండి

దశాబ్ధాల కల నెరవేర్చా, కావాలనే కొందరు అసత్య ప్రచారం: చంద్రబాబుపై మోడీవ్యాఖ్యలు

Follow Us:
Download App:
  • android
  • ios