సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు గురువారం... వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణితో పాటు.. వైఎస్ జగన్ సమక్షంలో వారు వైసీపీలో చేశారు. ఈ సందర్భంగా నార్నె చేసిన కామెంట్స్.. ఆసక్తికరంగా మారాయి.

వైసీపీలో  చేరిన అనంతరం నార్నె మీడియాతో మాట్లాడారు. తాను గత పదేళ్ల నుంచి వైసీపీతో అనుబంధం కొనసాగిస్తున్నట్లు  చెప్పుకొచ్చారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎలాంటి టికెట్ ఆశించడం లేదని.. టికెట్ కోసం పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు.

నార్నె..వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం రాగానే.. ఎన్టీఆర్ కూడా జగన్ కి మద్దతు తెలుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా దీనిపై నార్నె వివరణ ఇచ్చారు. తాను వైసీపీలో చేరడానికి.. తన అల్లుడు జూ.ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం అది తన వ్యక్తిగత అభిప్రాయమని తేల్చి చెప్పారు.