అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్. క్రైమ్ కి కేరాఫ్ అడ్రస్ జగన్ గారూ అంటూ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. 

సైబ‌రాబాద్ నిర్మించ‌డం సీఎం చంద్ర‌బాబుగారికి తెలుసన్న లోకేష్ సైబ‌ర్ క్రైమ్ చేయ‌డం మీకు మాత్ర‌మే తెలుసంటూ జగన్ పై ధ్వజమెత్తారు. ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష ప‌త్రాలు ఎత్తుకెళ్లిందీ నువ్వేనంటూ తిట్టిపోశారు. 

ల‌క్ష‌ల కోట్ల ప్ర‌జాధ‌నం లూటీ చేసిందీ నువ్వే అంటూ విరుచుకుపడ్డారు. టీడీపీ డేటా చోరీ చేసిందీ నువ్వే అంటూ మండిపడ్డారు. నేరాల్లోనూ, ఘోరాల్లోనూ, చోరీల్లోనూ నీకు నీవే సాటి నీ ర్యాంకు A1 అంటూ లోకేష్ ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్ పై ధ్వజమెత్తారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

డేటా లీక్ చేసింది జగనే.. సాక్ష్యాలు బయటపెట్టిన లోకేష్