Asianet News TeluguAsianet News Telugu

డేటా అసలు లీక్ కాలేదు.. చినరాజప్ప

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సమాచారం అసలు ఎక్కడా లీక కాలేదని హోంశాఖ మంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. కేవలం పార్టీల సమాచారం మాత్రమే లీకయ్యిందన్నారు. 

minister chinarajappa comments on data theft issue
Author
Hyderabad, First Published Mar 7, 2019, 3:45 PM IST

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సమాచారం అసలు ఎక్కడా లీక కాలేదని హోంశాఖ మంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. కేవలం పార్టీల సమాచారం మాత్రమే లీకయ్యిందన్నారు. ఏపీ  ప్రభుత్వానికి సంబంధించిన డేటా పోయిందని ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. కానీ జరగని తప్పుని జరగినట్లుగా నిరూపించడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ డేటాను ఓ ప్రైవేటు సంస్థ వద్దకు చేరిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డేటా చోరీ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపింది. ఈ ఘటన కారణంగా తెలంగాణ ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి మాటల యుద్ధం కూడా జరుగుతోంది. కాగా..దీనిపై తాజాగా చినరాజప్ప స్పందించారు.

ఐటీ గ్రిడ్ కంపెనీ వ్యవహారంపై సిట్ వేసే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉందని చెప్పారు. ఈ విషయంలో నిజానిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు. ఫారం-7 ఎవరైనా ఇవ్వొచ్చన్నారు. విచారణ చేసి ఎన్నికల సంఘం తొలగిస్తుందని చెప్పారు. ఓట్లు తీసేయమని మేమే దరఖాస్తు చేశామని జగన్, వాసిరెడ్డి పద్మ చెప్పిన సంగతి గుర్తు చేశారు.

బతికిఉన్న వారి ఓట్లు, అసలైన వారి ఓట్లను ఎలా తీసేయమని అడుగుతారని ప్రశ్నించారు. తెలంగాణలో కూడా గత ఎన్నికల్లో 25లక్షల ఓట్లు తొలగించి ఎన్నికలకు వెళ్లారని ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios