వచ్చే ఎన్నికల్లో ప్రజలు.. జగన్ కి పట్టం కట్టడం ఖాయని మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అన్నారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజలు.. జగన్ కి పట్టం కట్టడం ఖాయని మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. గురువారం ఆమె వైజగన్ సమక్షంలో.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు పార్టీ కండువా కప్పి.. జగన్ సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కిల్లి కృపారాణి మాట్లాడుతూ.. నిబద్ధత ఉన్నా నాయకుడు జగన్ అని అన్నారు. జగన్ కి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో ప్రతి అంశంపై వైఎస్ జగన్ ఓ అజెండా సెట్ చేస్తున్నారన్నారు. చంద్రబాబు దానికి రియాక్ట్ అవుతున్నారన్నారు. అజెండాను సెట్ చేసే వారే నాయకుడు అవుతారని అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక హోదా నినాదం ఇంకా సజీవంగా ఉండటానికి కారణం వైఎస్ జగన్ అన్నారు. వైఎస్సార్ సీపీ పోరాటాల వల్లే ఇప్పటికీ హోదా సజీవంగా ఉందని ఆమె అన్నారు. చంద్రబాబుకు హోదాపై చిత్తశుద్ధి ఉంటే యూపీఏలో ఎందుకు చేరలేదు అని ప్రశ్నించారు.
చంద్రబాబు గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు పప్పుఉ బెల్లంలా ఏదో ఇస్తున్నారని ఆరోపించారు. డబ్బుతో ఓటర్లను చంద్రబాబు కొనాలనుకుంటున్నారని ఆరోపించారు.
ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థను చంద్రబాబు దెబ్బతీశారన్నారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి, ప్రత్యేక హోదాను తీసుకురాలేదని మండిపడ్డారు.
హోదాను మోదీ కాళ్ల కింద తాకట్టు పెట్టారన్నారు. సంతలో పశువుల్లా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ధ్వజమెత్తారు. నీచమైన రాజకీయాలకు చరమగీతం పాడాలన్నారు. చంద్రబాబుకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.
