అమరావతి:  రాజకీయ సన్యాసాన్ని కొనసాగిస్తానని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు.

మంగళవారం నాడు ఆయన  విజయవాడలో మీడియాతో మాట్లాడారు. లగడపాటి రాజగోపాల్  త్వరలో జరిగే  ఎన్నికల్లో ఏదో అసెంబ్లీ లేదా పార్లమెంట్ సెగ్మెంట్ నుండి పోటీ చేస్తారని ప్రచారం సాగింది.

నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం ఉందని కూడ ప్రచారం సాగింది. అయితే  నర్సరావుపేట ఎంపీ స్థానం నుండి  తాను పోటీ చేయడం లేదని కూడ లగడపాటి రాజగోపాల్  స్పష్టం చేశారు.

తాను రాజకీయ సన్యాసాన్ని కొనసాగిస్తానని లగడపాటి ప్రకటించారు.  ఏ పార్టీలో చేరబోనని తేల్చి చెప్పారు.  వ్యాపారాలు చేసుకొంటానని లగడపాటి ఆయన తేల్చేశారు. ఏ రాజకీయ పార్టీలో కొనసాగనని కూడ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

నర్సరావుపేట నుండి పోటీపై తేల్చేసిన లగడపాటి రాజగోపాల్