హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సినీనటుడు, హీరో మంచు విష్ణు దంపతులు కలిశారు. లోటస్ పాండ్ లో జగన్ నివాసంలో విష్ణు ఆయన భార్య విరోనికా కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నూతనంగా ఇల్లు నిర్మించుకోవడం గృహ ప్రవేశం చెయ్యడంతో కలిసి అభినందనలు తెలిపారు. 

నూతన గృహ ప్రవేశానికి హాజరుకాకపోవడంతో మంచు విష్ణు ఆయన భార్య విరోనికా గృహప్రవేశం విషయాలపై చర్చించారు. కాసేపు కుటుంబ విషయాలు చర్చించుకున్నట్లు సమాచారం. అలాగే లండన్ పర్యటనపై కూడా ముచ్చటించినట్లు తెలుస్తోంది. 

అయితే విరోనికా వైఎస్ జగన్ కుటుంబానికి బంధువు కూడా. ఇకపోతే ఇటీవలే మంచు విష్ణు వైఎస్ జగన్ ను కలిశారు. ప్రజా సంకల్పయాత్ర ముగిసిన తర్వాత కలిశారు. తాజాగా మరోసారి గురువారం కలిశారు.