పట్టిసీమ శివరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో.. తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో ఓ వృద్ధురాలు కన్నుమూసింది. పలువురికి గాయాలు కూడా అయినట్లు సమాచారం.

శివరాత్రిని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా.. భక్తులకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఎండలో క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.