Asianet News TeluguAsianet News Telugu

కేంద్రం, తెలంగాణ సర్కార్లు టెర్రరిస్టులు: చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

:తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు టెర్రరిస్టుల్లా పనిచేస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఏపీ ఆర్ధిక మూలాలను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని చెప్పారు.

Chandrababunaiddu sensational comments on kcr and modi in amaravathi
Author
Amaravathi, First Published Mar 7, 2019, 2:06 PM IST


అమరావతి:తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు టెర్రరిస్టుల్లా పనిచేస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఏపీ ఆర్ధిక మూలాలను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని చెప్పారు.

గురువారం నాడు అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు.మూకుమ్మడిగా ఏపీ రాష్ట్రంపై దాడులు చేస్తున్నారని చెప్పారు.  ఏపీ రాష్ట్రానికి  ఇచ్చిన హామీలను  అమలు చేయాలని  అడగాలని కోరితే ఏపీపై   దాడులు  చేస్తున్నారన్నారు.

తెలంగాణలో ఓట్లను తొలగించి టీఆర్ఎస్ విజయం సాధించిందని చంద్రబాబునాయుడు చెప్పారు. అదే పద్దతిని ఏపీ రాష్ట్రంలో కూడ కొనసాగించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

టీడీపీ సమాచారాన్ని దొంగిలించి తప్పుడు కేసులు పెడతారా అని బాబు ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు జవాబుదారీతనంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ట్యాబ్‌లు తీసుకెళ్లి టీడీపీ మెంబర్‌షిప్‌ చేసినట్టుగా ఆయన చెప్పారు. 

ఓట్లు తొలగించి ఏపీ రాష్ట్రాన్ని అతలాకుతం చేస్తోందని బాబు ఆరోపించారు. హైద్రాబాద్‌లో ఉండే ఆర్ధిక మూలాలను ఉపయోగించుకొని కేసులు పెడుతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందన్నారు. ఏపీ ప్రజలను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఏపీ అభివృద్ధిని జగన్ అడ్డుకొంటే, మోడీ, కేసీఆర్‌లు కక్షపూరితంగా వ్యవహరించారని బాబు ఆరోపించారు.

రెండంకెల అభివృద్ధిని సాధించిన ఏకైక రాష్ట్రం ఏపీ  రాష్ట్రమేనని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.  విభజన చట్టంలోని హామీలను  కేంద్రం అమలు చేయలేదన్నారు.  

కేంద్రంతో జగన్ కుమ్మక్కయ్యారని బాబు ఆరోపించారు. ఏపీ రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తే ఇంకా అద్బుతమైన ఫలితాలు వచ్చేవని  బాబు అభిప్రాయపడ్డారు.  మోడీ ప్రభుత్వం కంటే 4.2 మెరుగైన అభివృద్ధిని సాధించామని ఆయన గుర్తు చేశారు.  రాష్ట్రంలో 8 లక్షల ఓట్లను వైసీపీ తొలగించేందుకు ఫారం-7 ధరఖాస్తు చేశారని చెప్పారు. ఏపీలో పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తున్నారని చెప్పారు. 

ఏ చట్టం కింద తెలంగాణలో సోదాలు చేశారో చెప్పాలని బాబు ప్రశ్నించారు. స్వయం ప్రతిపత్తిగల ప్రభుత్వం ఏపీ రాష్ట్రం హక్కులను కాపాడుకొంటామని బాబు స్పష్టం చేశారు. ఏపీ డీజీపీకి  హైద్రాబాద్‌లో స్థలం విషయమై కోర్టులో స్టే ఉందన్నారు. అయితే ఈ విషయమై స్టే ఉన్నా కూడ ఆయన స్థలాన్ని కూల్చారన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios