అమరావతి: ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబు ఎట్టకేలకు సైకిలెక్కారు. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే అశోక్ బాబు మాత్రం పెదవి విప్పలేదు. అయితే బుధవారం అర్థరాత్రి చంద్రబాబు నాయుడు ఏడుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. 

వారిలో అశోక్ బాబు ఒకరు. దీంతో అశోక్ బాబు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు అశోక్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. 

ఎమ్మెల్సీ కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో విశ్వాసం ఉందన్నారు. టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అశోక్ బాబు తెలిపారు. భవిష్యత్‌లో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని అశోక్‌బాబు ప్రకటించారు. 

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగ సంఘాల నుంచి ఒకరికి అవకాశం ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఆ హామీకి కట్టుబడి అశోక్ బాబుకు అవకాశం కల్పించారు సీఎం చంద్రబాబు