దీంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి వారసులు ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ఈ డేటా చోరీ వ్యవహారం కాస్త రాజ్ భవన్ మెట్టెక్కనుంది. ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డేటా చోరీ వ్యవహారంపై గవర్నర్ నరసింహాన్ కు ఫిర్యాదు చెయ్యాలని వైసీపీ నిర్ణయించింది.  

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతున్న డేటా చోరీ కేసు రాజ్ భవన్ కు చేరుకుంది. వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య మెుదలైన డేటా చోరీ వివాదం రెండు తెలుగురాష్ట్రాలకు పాకింది. 

దీంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి వారసులు ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ఈ డేటా చోరీ వ్యవహారం కాస్త రాజ్ భవన్ మెట్టెక్కనుంది. ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డేటా చోరీ వ్యవహారంపై గవర్నర్ నరసింహాన్ కు ఫిర్యాదు చెయ్యాలని వైసీపీ నిర్ణయించింది. 

అందులో భాగంగా బుధవారం సాయంత్రం 4.45 గంటలకు రాజ్‌భవన్‌లో నరసింహన్‌తో భేటీకానున్నారు జగన్. డేటా కుంభకోణంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి.