అమరావతి: డేటా చోరీ అంశంపై రెండు సిట్‌లను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఐటీ గ్రిడ్‌ కేసుపై తెలంగాణ ప్రభుత్వం ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఐటీ గ్రిడ్‌ కేసులో  తమ డేటాను తెలంగాణ పోలీసులు, వైసీపీ చోరీ చేసిందని ఆరోపిస్తూ టీడీపీ నేతలు ఏపీలో ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీలో కేసులు నమోదు చేశారు.డేటా చోరీ విషయమై విచారణ జరిపేందుకు గాను ఐపీఎస్ అధికారి బాలకృష్ణ నేతృత్వంలో  9మందితో సిట్ ఏర్పాటు చేయాలని సర్కార్ తలపెట్టింది. మరో వైపు ఫారం-7 దుర్వినియోగంపై సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు  చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. 

ఈ సిట్‌లో 15 మంది ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి ఈ సిట్‌లో డీఎస్పీ  స్థాయి అధికారి ఉంటారు.  ఒక్కో జిల్లా నుండి ఈ సిట్‌లో ప్రాతినిథ్యం ఉండేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

తెలంగాణ డేటా దొరికింది: ఐటీ గ్రిడ్‌పై స్టీఫెన్ రవీంద్ర వ్యాఖ్యలు

కేంద్రం, తెలంగాణ సర్కార్లు టెర్రరిస్టులు: చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు