కాంగ్రెస్-టీడీపీల పొత్తుపై వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాల కోసమే కాంగ్రెస్ టీడీపీల పొత్తు అంటూ మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించిన పార్టీతో పొత్తుపెట్టుకోవడం సిగ్గు చేటంటూ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడ్డానికే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటున్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించడం హేయంగా ఉందన్నారు.
ప్రకాశం: కాంగ్రెస్-టీడీపీల పొత్తుపై వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాల కోసమే కాంగ్రెస్ టీడీపీల పొత్తు అంటూ మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించిన పార్టీతో పొత్తుపెట్టుకోవడం సిగ్గు చేటంటూ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడ్డానికే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటున్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించడం హేయంగా ఉందన్నారు.
ఎన్టీఆర్ బాటలో వెళ్తున్నానని చెప్తున్న చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో పొత్తు కంటే ఘోరం కంటే మరొకటి ఉండదన్నారు. నాలుగున్నరేళ్లుగా ప్రజాస్వామ్యానికి చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని ఎద్దేవా చేశారు. పరిపాలనను గాలికొదిలేసి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దాడిని పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అంటూ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు మరోసారి ఖూనీ చేశారన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నాలుగేళ్లైనా పూర్తి కాలేదు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఏడాదిలోగా వెలుగొండను పూర్తి చేస్తాం. చంద్రబాబువి అవకాశవాద రాజకీయాలు అని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి
తన సంపద పెంచుకోవడమే చంద్రబాబు విజన్... విజయసాయి రెడ్డి
కాంగ్రెసుతో టీడీపీ దోస్తీ: ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి నిరసన
సోనియాని రాక్షసి బొందపెట్టాలన్నాడు.. చివరికి కాంగ్రెస్ కాళ్ల దగ్గరకే: విజయసాయి
