సారాంశం
మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్న అనకాపల్లిలో వైసీపీ , జనసేన మధ్య నువ్వానేనా అన్నట్లుగా వుంది పరిస్ధితి. ఇరు వర్గాలు పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నాయి.
అనకాపల్లి జిల్లాలో అధికార వైసీపీ, ప్రతిపక్ష జనసేన మధ్య అగ్గి రాజుకుంది. పోటాపోటీ ఫ్లెక్సీలతో హీట్ పెంచుతున్నాయి ఇరు వర్గాలు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్న అనకాపల్లిలో వైసీపీ , జనసేన మధ్య నువ్వానేనా అన్నట్లుగా వుంది పరిస్ధితి. ఇరు వర్గాలు పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నాయి. పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేరుతో పట్టణంలో పోస్టర్లు వెలిశాయి. ఇక దీంతో ముఖ్యమంత్రి జగన్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు జనసైనికులు. పట్టణంలో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తడంతో పోలీసులు భారీగా మోహరించారు.