విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత టీజేఆర్ సుధాకర్ నిప్పులు చెరిగారు. జనసేనతో పొత్తుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ నేతలను రాయబారానికి పంపుతున్నారన్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే తనతో మాట్లాడిన వారి పేర్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరితోనూ పొత్తుల కోసం వెంపర్లాడాల్సిన అసవరం లేదన్నారు. పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చిన వాళ్లు అధికారికంగా వచ్చారో వ్యక్తిగతంగా వచ్చారో పవన్ చెక్ చేసుకోవాలని సూచించారు. 

తాము జనసేనతో పొత్తుల కోసం వెంపర్లాడుతున్నామని చెప్తున్న పవన్ కళ్యాణ్ ముందు టీడీపీతో చేసుకున్న రహస్య ఒప్పందాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పవన్ ప్రజలకు వ్యతిరేకంగా నిలబడబోతున్నారంటూ సుధాకర్ బాబు అభిప్రాయపడ్డారు.

మరోవైపు టీడీపీపైనా విరుచుకుపడ్డారు. ఒకవైపు 70 ఏళ్ళ వయసులో ఒదిగిపోయే సూర్యుడంటూ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబు మాటలే తప్ప చేష్టలు ఉండవన్నారు. 

మరోవైపు నాలుగు పదుల వయసు ఉన్న నవ యువ నాయకుడు వైఎస్ జగన్ స్వామి వివేకానంద చెప్పిన లక్షణాలన్నీ పుణికిపుచ్చుకుని తాడిత, పీడిత ప్రజలకు నేనున్నా అని భరోసా ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ పేదలకు, సామాన్యులకు త్వరలో రాజన్న రాజ్యం ద్వారా తేబోతున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. 

చంద్రబాబు ఒక గుంపును పక్కన పెట్టుకొని జగన్ పై నీలాపనిందలు వేసి, ఆయన స్థాయిని తగ్గించాలని కుట్ర చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు, ఆయన భౌబౌ గ్యాంగు జగన్ ముగింపు సభ చూసి వణికిపోతున్నారని విమర్శించారు. వైసీపీ నవరత్నాల్లో చెప్పిన పథకాలను చంద్రబాబు అమలు చేస్తానడననారు. 

మొద్దు నిద్రపోతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తన పాదయాత్ర ద్వారా  జగన్ మోహన్ రెడ్డి ఉలిక్కిపడేలా చేశారన్నారు.  అటు సోమిరెడ్డి ఓ సోదిరెడ్డి అని జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి ఓ జంతువు అంటూ అభిప్రాయపడ్డారు. వర్ల రామయ్య ఇలా వాజమ్మల్లా జగన్ పై నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు.  

ఈ వార్తలు కూడా చదవండి

ఎన్నికలకు ముందే వైసీపీకి తొలి విజయం