Asianet News TeluguAsianet News Telugu

భువనేశ్వరి యాత్రకు పోటీగా వైసీపీ సామాజిక సాధికారిత బస్సు యాత్ర .. షెడ్యూల్ ఇదే

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి యాత్రకు పోటీగా వైసీపీ సైతం బస్సు యాత్రకు సిద్ధమైంది. గడిచిన నాలుగున్నరేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి , సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు గాను ‘‘సామాజిక సాధికారిత బస్సు యాత్ర’’కు పిలుపునిచ్చింది.

YSRCP Samajika Sadhikara Bus Yatra schedule ksp
Author
First Published Oct 24, 2023, 7:19 PM IST

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతూ వుండటంతో నేతలు జనంలో వుండటానికి పావులు కదుపుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో వున్నప్పటికీ.. అక్కడి నుంచే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. లోకేష్.. ఢిల్లీలో కోర్టులు, న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తున్న నేపథ్యంలో భువనేశ్వరిని రంగంలోకి దించుతున్నారు చంద్రబాబు. దీనిలో భాగంగా ‘‘నిజం గెలవాలి’’ పేరుతో ఆమె యాత్రకు శ్రీకారం చుట్టారు. దీనిని విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు శ్రమించనున్నాయి.

మరోవైపు భువనేశ్వరి యాత్రకు పోటీగా వైసీపీ సైతం బస్సు యాత్రకు సిద్ధమైంది. గడిచిన నాలుగున్నరేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి , సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు గాను ‘‘సామాజిక సాధికారిత బస్సు యాత్ర’’కు పిలుపునిచ్చింది. అక్టోబర్ చివరి నుంచి డిసెంబర్ 31 వరకు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలోని మూడు దశల్లో ఈ యాత్ర జరగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను వైసీపీ విడుదల చేసింది. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ప్రతిరోజూ యాత్ర ఉంటుందని తెలిపింది. 

సామాజిక సాధికారిత బస్సు యాత్ర షెడ్యూల్ : 

అక్టోబ‌ర్ 26 – ఇచ్చాపురం, తెనాలి, శింగ‌న‌మ‌ల‌
అక్టోబ‌ర్ 27 – గ‌జ‌ప‌తిన‌గ‌రం, న‌ర‌సాపురం, తిరుప‌తి
అక్టోబ‌ర్ 28 – భీమిలి, చీరాల, పొద్దుటూరు
అక్టోబ‌ర్ 30 – పాడేరు, దెందులూరు, ఉద‌య‌గిరి
అక్టోబ‌ర్ 31 – ఆముదాల‌వ‌ల‌స, నందిగామ, ఆదోని
న‌వంబ‌ర్ 1 – పార్వతీపురం, కొత్తపేట, క‌నిగిరి
న‌వంబ‌ర్ 2 – మాడుగుల, అవ‌నిగ‌డ్డ, చిత్తూరు
న‌వంబ‌ర్ 3 – న‌ర‌స‌న్నపేట, కాకినాడ రూర‌ల్, శ్రీకాళ‌హ‌స్తి
న‌వంబ‌ర్ 4 – శృంగ‌వ‌ర‌పుకోట, గుంటూరు ఈస్ట్, ధ‌ర్మవ‌రం
న‌వంబ‌ర్ 6 – గాజువాక, రాజ‌మండ్రి రూర‌ల్, మార్కాపురం
న‌వంబ‌ర్ 7 – రాజాం, వినుకొండ, ఆళ్లగ‌డ్డ
న‌వంబ‌ర్ 8 – సాలూరు, పాల‌కొల్లు, నెల్లూరు రూర‌ల్
న‌వంబ‌ర్ 9 – అన‌కాప‌ల్లి, పామ‌ర్రు, తంబ‌ళ్లప‌ల్లె
 

Follow Us:
Download App:
  • android
  • ios