అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ బహిరంగ లేఖ రాశారు. అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీల అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని లేఖలో కోరారు. 

అంతర్రాష్ట్ర బదిలీలను సత్వరమే పూర్తి చేయాలని కేసీఆర్‌ను జగన్ కోరారు. మానవతా దృక్పథంతో ఆలోచించి బదిలీలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పరస్పర బదిలీలపై కమిటీ సవరణ ఉత్తర్వులు విడుదల చేయాలని వైఎస్ జగన్‌ తన లేఖలో కోరారు.