వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ రెండో రోజు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కొద్దిసేపటి క్రితం వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్, ఆయన తల్లి విజయలక్ష్మి ప్లీనరీ వేదిక వద్దకు చేరుకన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ రెండో రోజు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కొద్దిసేపటి క్రితం వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్, ఆయన తల్లి విజయలక్ష్మి ప్లీనరీ వేదిక వద్దకు చేరుకన్నారు. వేదికపై ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు, ప్లీనరీకి హాజరైన పార్టీ శ్రేణులకు జగన్, విజయమ్మ అభివాదం చేశారు. అనంతరం పరిపాలన వికేంద్రీకరణ, పారదర్శకత తీర్మానంపై చర్చను స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు.
ఇక, ప్లీనరీలో తొలి రోజు నాలుగు తీర్మానాలు చేసిన వైసీపీ.. నేడు సామాజిక న్యాయం, పారదర్శక పాలన, వ్యవసాయ రంగం, దుష్ట చతుష్టయంపై తీర్మానాలు చేయనుంది. అలాగే వైసీపీ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఈ మేరకు శుక్రవారం వైసీపీ ప్లీనరీ వేదికగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటన చేశారు. శనివారం సాయంత్రం అద్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నట్టుగా చెప్పారు. ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి కొన్ని సవరణలు చేయనున్నారు.
ఇక, వైఎస్ జగన్‌ను వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా మార్చేందుకు వీలుగా సవరణ చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈరోజు సాయంత్రం వైఎస్ జగన్.. ప్లీనరీలో ముగింపు ఉపన్యాసం చేయనున్నారు. అయితే వైఎస్ జగన్ తన స్పీచ్‌లో ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్దం చేసేలా సీఎం జగన్ భవిష్యత్ కార్యచరణను ప్రకటించనున్నారు.
