వైసీపీ ఫైర్‌బ్రాండ్, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్ర బలగాల పహారాలోకి వెళ్లిపోయారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు వై కేటగిరి భద్రత కల్పించడంతో సీఐఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి.

పది మంది కమాండోలు ఆయనకు సెక్యూరిటీగా ఉన్నారు. ఈ క్రమంలో కేంద్ర బలగాలతో కలిసి ఆయన ఓ ఫోటో దిగారు. అందులో ఆయన చుట్టూ సెక్యూరిటీ సిబ్బంది నిలబడి వున్నారు.

కొద్దినిమిషాల్లోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు.. రాజుగారు అనుకున్నది సాధించారంటూ కామెంట్లు  పెడుతున్నారు. కాగా కొందరు వైసీపీ కార్యకర్తలు రఘురామకృష్ణంరాజు దిష్టి బొమ్మల్ని దగ్ధం చేయడంతో ఆయనపై పోలీస్ స్టేషన్‌లలో సైతం ఫిర్యాదు చేశారు.

దీంతో తాను  నియోజకవర్గంలోకి వెళ్లలేకపోతున్నానని.. తనకు భద్రత కల్పించాలంటూ రఘురామ కేంద్రమంత్రులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హోంశాఖ ఆయనకు  వై కేటగిరి భద్రతను కల్పించింది,