Asianet News TeluguAsianet News Telugu

పిన్నెల్లిపై దాడి: చేతకాక దాడులు చేయిస్తున్నారు, బాబుపై రోజా వ్యాఖ్యలు

వైసీపీ సీనియర్ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడిని ఖండించారు నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా. ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన చంద్రబాబు భరించలేక ఇలాంటి దాడులు చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. 

ysrcp nagari mla rk roja slams tdp chief chandrababu over stone pelting on macherla mla pinnelli ramakrishna reddy car
Author
Amaravathi, First Published Jan 7, 2020, 3:30 PM IST

వైసీపీ సీనియర్ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడిని ఖండించారు నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా. ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన చంద్రబాబు భరించలేక ఇలాంటి దాడులు చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు.

చంద్రబాబు వెనక నుంచి చేతకాని రాజకీయం చేస్తున్నారని.. సినిమాల్లోనే ఇలాంటి దాడులు చూస్తామంటూ రోజా ఘాటుగా బదులిచ్చారు. రైతుల పేరుతో టీడీపీ రౌడీలు దాడులకు దిగుతున్నారని.. వైసీపీ ప్రభుత్వం ఎల్లప్పుడు ప్రజల కోసమే పనిచేస్తుందని రోజా స్పష్టం చేశారు. తాము అన్ని విధాలా రైతులకు అండగా ఉంటామని ఆమె వెల్లడించారు. 

Also Read:రైతులు మందుకొట్టి వస్తారా, వాళ్లు టీడీపీ మనుషులే.. బాబు పనే: పిన్నెల్లి వ్యాఖ్యలు

కాగా ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా పై  ఇటీవల దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రోజా చాలా సీరియస్ గా ఉన్నారు. తమ పార్టీ కార్యకర్తలపైనే పుత్తూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కేబీఆర్‌పురంలో గ్రామ సచివాలయ భూమిపూజకు వెళ్లిన సమయంలో సురేష్, రిషేంద్ర, హరీష్, సంపత్,  అంబు, సరళ, రామ్మూర్తి తనపై దాడికి యత్నించారని రోజా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 143,341,427,506, 509 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద పుత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

మొత్తం 30మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. కాగా ఎమ్మెల్యే రోజా కారును అడ్డుకోవడాన్ని వైసీపీ దళిత విభాగం నాయకులు ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కొంతమంది స్వార్థపరుల ప్రోద్బలంతో ఇదంతా జరిగిందన్న వారు వారి ఉచ్చులో పడవద్దని సాటి దళితులుగా కోరుతున్నామని తెలిపారు.

పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే రోజా జనవరి 5న నగరి నియోజవర్గంలోని పుత్తూరు మండలంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో కేబీఆర్ పురం గ్రామంలోకి ప్రవేశించకుండా..ఒక వర్గం వైసీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు. 

Also Read:పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రాజధాని సెగ: గన్‌మెన్లపై పిడిగుద్దులు, రాళ్ల దాడి

సుమారు 20 నిమిషాల పాటు ఆమె కారును నిలిపిన వైసీపీ కార్యకర్తలు.. రోజా సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వినలేదు. అంతేకాకుండా పెద్ద ఎత్తున రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వారికే ఎమ్మెల్యే ప్రాధాన్యమిస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు.

కారు అద్దాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆందోళలనకారులను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా తమ పార్టీకి చెందిన అమ్ములు వర్గమే దాడి చేయించిందని ఆరోపించిన రోజా.. విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఇక పార్టీ కార్యకర్తలకు రోజా ప్రాధాన్యం ఇవ్వడం లేదని అమ్ములు వర్గం ఆరోపణలు చేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios