రైతులు మందుకొట్టి వస్తారా, వాళ్లు టీడీపీ మనుషులే.. బాబు పనే: పిన్నెల్లి వ్యాఖ్యలు

తన కారుపై దాడి చేసింది రైతులు కాదని.. టీడీపీ నాయకులే అన్నారు వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. దాడి ఘటనపై స్పందించిన ఆయన రాజధాని రైతులు చంద్రబాబు మాయాలో పడొద్దని సూచించారు

ysrcp macherla mla pinnelli ramakrishna reddy comments after stone pelting on his car

తన కారుపై దాడి చేసింది రైతులు కాదని.. టీడీపీ నాయకులే అన్నారు వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. దాడి ఘటనపై స్పందించిన ఆయన రాజధాని రైతులు చంద్రబాబు మాయాలో పడొద్దని సూచించారు.

రాజధాని ముసుగులో దాడులు మానుకోవాలని... తెలుగుదేశం పార్టీ బెదిరింపులకు భయపడేది లేదని పిన్నెల్లి స్పష్టం చేశారు. తన కారుపై రాళ్లు రువ్విన వారంతా ఆ సమయంలో మద్యం తాగి ఉన్నారని రామకృష్ణారెడ్డి వివరించారు.

Also Read:పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రాజధాని సెగ: గన్‌మెన్లపై పిడిగుద్దులు, రాళ్ల దాడి

నిజమైన రైతులైతే మద్యం తాగి కర్రలతో ఆందోళన చేస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. దాడి వెనుక చంద్రబాబు హస్తం వుందని, పథకం ప్రకారమే తనపై దాడికి దిగారని పిన్నెల్లి ఆరోపించారు. 

కాగా అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని పరిరక్షణ సమితి జేఎసీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు  జాతీయ రహదారుల దిగ్భంధనానికి పిలుపునిచ్చారు..

గుంటూరు జిల్లా చిన కాకాని వద్ద జేఎసీ నేతలు రహదారి దిగ్భందం చేస్తున్నారు. ఆ సమయంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు రాస్తారోకోలో చిక్కుకుపోయింది. దీంతో నిరసనకారులు  చీప్ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారును చుట్టుముట్టారు.

Also Read:రాజధాని రచ్చ: లోకేష్ సహా పలువురు టీడీపీ నేతల అరెస్ట్

కారు వద్ద ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి రక్షణగా గన్‌మెన్లు నిలుచున్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తి వచ్చి గన్‌మెన్లపై దాడికి దిగారు. కారును ముందుకు వెళ్లకుండా నిరసనకారులు అడ్డుకొన్నారు. కారుపై నిరసనకారులు దాడికి దిగారు. ఎమ్మెల్యే కారుకు మరో కారును అడ్డుగా నిలిపారు.  కారుపై రాళ్లతో దాడికి దిగారు.

వైసీపీకి చెందిన ఎమ్మెల్యే అంటూ కారు చుట్టూ ఆందోళనకారులు అడ్డుకొన్నారు. కారు ముందు కొందరు బైఠాయించారు. కారును ముందుకు పోకుండా అడ్డుకొన్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో కారును ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుకు అడ్డు పెట్టారు. పిన్నెల్లి కారు ముందుకు వెళ్లకుండా అడ్డుకొన్నారు.

పోలీసులు కారును బయటకు పంపేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఆందోళనకారుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారును ముందుకు వెళ్లకుండా అడ్డుకొన్నారు. అయితే ఈ సమయంలో కారుపై కర్రలతో దాడికి పాల్పడ్డారు.ఈ సమయంలో కారు అద్దాలను మూసివేశారు. మరో వైపు కారుపై రాళ్లతో దాడికి దిగారు.

Also Read:రాజధాని రచ్చ: టీడీపీ నేతల హౌస్‌ అరెస్టులు, ఉద్రిక్తత

ఈ రాళ్ల దాడితో కారు వెనుక అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ సమయంలో ఎమ్మెల్యే కారు డ్రైవర్ ఎదురుగా ఉన్న కారును అతి చాకచక్యంగా తప్పించుకొంటూ స్పీడుగా ముందుకు పోనిచ్చాడు. ఈ సమయంలో ఎమ్మెల్యే కారును వెంటాడి రాళ్లతో దాడికి దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios