విశాఖపట్నం (visakha railway zone) కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ (South Coast Railway ) ప్రధాన కార్యాలయం కార్యకలాపాలను వెంటనే ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (railway minister ashwini vaishnaw ) హామీ ఇచ్చారు.
విశాఖపట్నం (visakha railway zone) కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ (South Coast Railway ) ప్రధాన కార్యాలయం కార్యకలాపాలను వెంటనే ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (railway minister ashwini vaishnaw ) హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డి (vijayasai reddy) పార్టీ లోక్‌సభాపక్ష నాయకులు పీవీ మిధున్ రెడ్డి (mithun reddy) శుక్రవారం పార్లమెంట్‌లోని మంత్రి కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు.
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నా కార్యకలాపాలను ప్రారంభించడంలో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని వారు అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి వెంటనే విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరచిన హామీలను కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేసేలా వైసీపీ చిత్తశుద్ధితో కృషిని కొనసాగిస్తుందని విజయసాయి రెడ్డి, మిధున్ రెడ్డి పేర్కొన్నారు.
ALso Read:విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ: పవన్ సంచలన నిర్ణయం.. జగన్ సర్కార్‌పై దీక్షాస్త్రం
మరోవైపు విశాఖ రైల్వే జోన్‌పై వైసీపీ ఎంపీలు లోక్‌సభలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. జీవో అవర్‌లో ఈ అంశంపై అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి (bv satyavathi), రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌లు (margani bharat) వేర్వేరు సమయాల్లో మాట్లాడారు. జోన్ మంజూరు చేయడంతోపాటు, దానికి రూ.300 కోట్లు కేటాయించినందుకు సత్యవతి ధన్యవాదాలు తెలపగా.. అసలు జోన్ అమల్లోకి వస్తుందా? రాదా? అన్న అమోయయం రాష్ట్ర ప్రజల్లో నెలకొందని భరత్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
