జనసేన (janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (pawan kalyan) ఈనెల 12న విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్షలో పాల్గొననున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దీక్ష చేయనున్నారు.

జనసేన (janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (pawan kalyan) ఈనెల 12న విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్షలో పాల్గొననున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దీక్ష చేయనున్నారు. ఉక్కుపై 300 రోజులుగా కార్మికులు పోరాడుతున్నా సీఎం స్పందించడంలేదని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై సీఎం జగన్‌ స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నేతలను సీఎం ఢిల్లీ తీసుకెళ్లాలని పవన్ సూచించారు. కార్మికులకు మద్దతు కొనసాగింపుగా పవన్‌ దీక్ష చేయనన్నట్టు జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. పవన్‌తో పాటు పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్‌, పీఏసీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, అనుబంధ విభాగాల ఛైర్మన్లు దీక్షలో పాల్గొంటారని పేర్కొన్నారు.

కాగా.. రుణ భారం అధికం కావ‌డంతో పాటు అప్పుల్లోకి జారుకుంటున్నాయ‌నే కార‌ణాలు చూపుతూ కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను ప్ర‌యివేటీక‌రిస్తోంది. వాటిల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. అయితే, ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నిన‌దిస్తూ Vizag steel plant కోసం కార్మికులు, రాష్ట్ర ప్ర‌జ‌లు పోరాటం సాగిస్తున్నారు. గత బుధ‌వారం నాటికి స్టీల్ ప్లాంట్ కార్మిక పోరాటం 300 రోజులకు చేరింది. ఈ నేప‌థ్యంలోనే కార్మికులు స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ‌ నిరసిస్తూ సాగుతున్న ఉద్య‌మాన్ని మ‌రింత ఉధృత చేసే దిశ‌గా ప్ర‌ణాళిక‌లు చేస్తున్నారు. కేంద్రం Vizag steel plant ప్ర‌యివేటీక‌ర‌ నిర్ణయం తీసుకున్న జనవరి 27 నుండి కార్మిక‌లు, రాష్ట్ర ప్ర‌జ‌లు ఉద్య‌మం చేస్తున్నారు. ప్ర‌యివేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Also Read:విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై వారం రోజుల్లో కార్యాచరణ ప్రకటించాలి: జగన్ సర్కార్‌కి పవన్ అల్టిమేటం

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష పార్టీ తెలుగుదేశం పార్టీ సైతం Vizag steel plant ప్ర‌యివేటీక‌ర‌ణ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. జ‌న‌సేన సైతం ఈ ఉద్య‌మానికి సై అంది. టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక పోరాటానికి మద్దతు ప్ర‌క‌టించ‌డంతో పాటు వారి వద్దకు వెళ్లి సంఘీభావం సైతం తెలిపారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తూ.. Vizag steel plant ను ప్ర‌యివేటీక‌రించ వ‌ద్ద‌ని కేంద్రాన్ని కోరారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం సైతం కేంద్రానికి లేఖ రాసింది. ఈ నిర్ణ‌యం మార్చుకోవాల‌ని లేఖ‌లో కోరింది. రాష్ట్రమంతా ఈ నిర్ణ‌యాన్ని వ్యతిరేకిస్తుంటే, ఇటీవల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో ముందుకు నడుస్తుంటే కేంద్రం మాత్రం Vizag steel plant ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు నిర్ణ‌యంలో మార్పు లేదంటూ స్ప‌ష్టం చేసింది. Vizag steel plant ప్ర‌యివేటీక‌ర‌ణ బ‌దులుగా స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేశించాల్సిన అవ‌రాన్ని సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు.