Asianet News TeluguAsianet News Telugu

వైసీపీలో కేంద్ర బడ్జెట్ చిచ్చు, బాగుందని ఒకరు, బాగోలేదని మరొకరు: ఎంపీల మిశ్రమ స్పందనపై చర్చ


వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డితోపాటు వైసీపీ ఎంపీలు అంతా బడ్జెట్ పై ఆగ్రహంగా ఉంటే రఘురామకృష్ణంరాజు మాత్రం ప్రశంసించడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో ఒకరు అవునంటే మరోకరు కాదంటూ మిశ్రమంగా స్పందించడంపై ఆసక్తికర చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 

ysrcp mps are Mixed reaction on union budget
Author
Amaravathi, First Published Jul 5, 2019, 7:53 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేంద్ర బడ్జెట్ గందరగోళానికి తెరలేపింది. కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మిశ్రమంగా స్పందిస్తుండటం చర్చనీయాంశంగా మారింంది. 

కేంద్రబడ్జెట్ నిరాశజనకంగా ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు.కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందని అభిప్రాయప్డడారు. ఆంధ్రప్రదేశ్ కు సాయం చేస్తామని ఇచ్చిన హామీని కేంద్రప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. 

పోలవరం జాతీయ ప్రాజెక్టు, అమరావతి రాజధానిల ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరమన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అదనంగా ఇచ్చింది ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. బడ్జెట్ లో ఎక్కడా ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని పెదవి విరిచారు. 

ఏపీ విభజన చట్టంలోని అంశాలపై ప్రస్తావన కూడా రాలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండిచేయి చూపిందని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారన్న దానిపై కూడా స్పష్టత లేదని అభిప్రాయపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.60 వేల కోట్ల వరకు పెరిగిందని ఈ బడ్జెట్ లో తమకు న్యాయ జరుగుతుందని ఆశించినట్లు వెల్లడించారు. ఈ బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆశలుపెట్టుకుందని తెలిపారు.  

ఏపీ ప్రయోజనాలను కాపాడటం కోసం ఏ పోరాటానికైనా తాము సిద్ధమని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పార్లమెంటులో ప్రశ్నిస్తామని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

మరోవైపు కార్మికులకు పెన్షన్ల ఇచ్చే నిర్ణయాన్ని వైసీపీ స్వాగతిస్తుందని స్పష్టం చేశారు. ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌ కార్డులు ఇవ్వడం మంచిదేనన్నారు. అయితే ఎయిరిండియాను ప్రైవేటీకరించడం సరికాదని చెప్పారు. పారిశ్రామికరంగానికి ఏం చేస్తారన్నదానిపై స్పష్టత ఇవ్వలేదని విజయసాయిరెడ్డి  వ్యాఖ్యానించారు. 

ఇదిలా ఉంటే నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాత్రం బడ్జెట్ చాలా బాగుందని అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో మంచి బడ్జెట్ అంటూనే ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరగలేదని అందరూ అంటున్నారని తాను కూడా ఏకీ భవిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 

అయితే కేంద్రబడ్జెట్ లో ఉన్న పథకాలన్నీ అద్భుతంగా ఉన్నాయని కొనియడారు. గ్రామీణ సడక్ యోజన గానీ, పీపీపీ విధానంలో పరిశ్రమల అభివృద్ధి, ఇళ్ల నిర్మాణం పథకాలు చాలా బాగున్నాయన్నారు. అయితే కేంద్రం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల్లో సింహ భాగం రాష్ట్రానికి వచ్చేలా కృషి చేస్తామన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంపై చర్చిస్తామని చెప్పుకొచ్చారు. బడ్జెట్ ను పూర్తిగా అధ్యయనం చేసి రాష్ట్రానికి కావాల్సిన నిధులపై అవసరమైతే ప్రధానిని కలుస్తానన్నారు. ప్రధానితో మాట్లాడి బడ్జెట్ డిష్కషన్ లో పొందుపరచుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.   

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డితోపాటు వైసీపీ ఎంపీలు అంతా బడ్జెట్ పై ఆగ్రహంగా ఉంటే రఘురామకృష్ణంరాజు మాత్రం ప్రశంసించడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో ఒకరు అవునంటే మరోకరు కాదంటూ మిశ్రమంగా స్పందించడంపై ఆసక్తికర చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios