సీబీఐకి లేఖ: కడపకు వైఎస్ అవినాష్ రెడ్డి
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ సీబీఐ విచారణకు హాజరు కాలేదు. సీబీఐ విచారణకు హాజరు కాలేనని లేఖ పంపిన అవినాష్ రెడ్డి కడపకు బయలుదేరారు.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మంగళవారంనాడు ఉదయం హైద్రాబాద్ లోని తన నివాసం నుండి కడపకు బయలుదేరారు. ఇవాళ ఉదయం హైద్రాబాద్ లోని తన నివాసం నుండి వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి వెళ్తున్నారని భావించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కాన్వాయ్ వెంట మీడియా వాహనాలు కూడా అనుసరించాయి. హైద్రాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయం వైపునకు కాకుండా కడప వైపునకు వైఎస్ అవినాష్ రెడ్డి కాన్వాయ్ బయలుదేరింది. దీంతో సీబీఐకి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాసిన విషయం వెలుగు చూసింది. ఈ విషయాన్ని వైఎస్ అవినాష్ రెడ్డి న్యాయవాది కూడా ధృవీకరించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు రావాలని వైఎస్ అవినాష్ రెడ్డికి నిన్ననే సీబీఐ అధికారులు నోటీసులు పంపారు. 160 సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు పంపారు.
కడపకు వైఎస్ అవినాష్ రెడ్డి వెళ్తున్న సమయంలో ఈ నోటీసులు అందాయి. దీంతో వైఎస్ అవినాష్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్త కోట నుండి హైద్రాబాద్ కు తిరిగి వచ్చారు. ఇవాళ ఉదయమే సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది.
also read:విచారణకు రాలేను: సీబీఐని నాలుగు రోజుల గడువు కోరిన వైఎస్ అవినాష్ రెడ్డి
ముందస్తుగా ఖరారైన కార్యక్రమాలున్నందున ఇవాళ విచారణకు రాలేనని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ పంపారు. ఆన్ లైన్ లో ఈ లేఖ పంపిన తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి కోఠిలోని సీబీఐ కార్యాలయానికి కాకుండా కడపకు వెళ్లారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి లేఖపై సీబీఐ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.2019 మార్చి 14న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు
ఈ హత్య కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేసింది సీబీఐ. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని గత మాసంలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూన్ 30 లోపుగా విచారణను పూర్తి చేయాలని సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు.