హైదరాబాద్: తెలుగుదేశం పార్టీపై ట్విట్టర్ వేదికగా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు గురించి తాను చెప్పింది వాస్తవమని అయితే టీడీపీ బుకాయించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. 

రాష్ట్రం అప్పుల గురించి తాను చెప్పిన సమాచారం నిజమన్నారు. సీఎం చంద్రబాబు, బ్రోకరు కలిసి ముంచేశారని విమర్శించారు. ఫైనాన్స్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్స్ రెండింటిలోను దొంగ లెక్కల నిపుణుడిని పెట్టి అప్పుగా తెచ్చిన లక్షల కోట్లు దోచేశారని ఘాటు విమర్శించారు. 

త్వరలో విచారణ ప్రారంభం కాగానే బ్రోకరు గారు "నాకేం సంబంధం" అంటూ పారిపోవడం ఖాయమన్నారు. ఇంతకీ ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక మంత్రిగా ఉన్నది యనమలా? కుటుంబరావా? అని ప్రశ్నించారు. 

యనమల డిజ్యూర్ అయితే, కుటుంబ రావు సామాజిక కారణాల వల్ల ఢిఫ్యాక్టో అయ్యాడా? ఆరు కోట్ల ప్రజల ఆర్థిక వ్యవస్థను ఇన్నేళ్లుగా ఒక స్టాక్ బ్రోకర్ చేతిలో పెట్టారా? అంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు.