మహానాయుకుడు సినిమా ద్వారా చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేశారని వైఎస్సార్‌సిపి ఎంపి విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచి పార్టీని హస్తగతం చేసుకున్నట్లు కాకుండా...టిడిపిని కాపాడినట్లు చూపించారని అన్నారు. ఇలా అసలు కథలో విలన్ ను సినిమాలో హీరోగా చూపించేందుకు ప్రయత్నం చేయడం ప్రేక్షకులకు నచ్చలేదని...అందువల్లే విడుదలై వారం రోజులు కాకముందే మహానాయకుడు ప్లాప్ టాక్ తెచ్చుకుందని విజయసాయి రెడ్డి తెలిపారు. 

ఈ మహానాయకుడు సినిమాపై విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికన ఈ విధంగా స్పందించారు. '' బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో వచ్చిన పార్ట్-2లో చంద్రబాబు వెన్నుపోటు పొడవలేదు, పార్టీని రక్షించిన హీరో అని చిత్రీకరించారు. భారీ పబ్లిసిటీతో రిలీజ్ చేశారు. చరిత్రను వక్రీకరించారని పసిగట్టిన ప్రేక్షకులు కర్రు కాల్చి వాత పెట్టారు. నరకాసురుడు ఎప్పటికే విలనే, హీరో కాలేడు.'' అంటూ కాస్త ఘాటైన ట్వీట్ చేశారు. 

ఇక మరో ట్వట్ ద్వారా విజయసాయి రెడ్డి వైఎస్సార్‌సిపి పార్టీ విజయం పట్ల ధీమా వ్యక్తం చేశారు. '' గెలుస్తామనే ఆత్మ విశ్వాసం ఉన్నవాళ్లు దేనికీ భయపడరు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా విజయాన్ని అడ్డుకోలేరని ధైర్యంగా చెబ్తారు. పతనం తప్పదని గ్రహించిన వారి ఏడుపేమో..అదిగో వాళ్లెవరెవరో కలిసి పోయారు.చూశారా ఆయన్ను ఈయన తిట్టడం లేదు.కుట్ర పన్నుతున్నారంటూ క్షణక్షణం వణికిపోతుంటాడు చంద్రబాబు!''  
  
''చంద్రబాబుకు రోజూ ఒక పీడకల వస్తుంది. తన అవినీతిని ఆధారాలతో సహా బయట పెట్టే వారు, రాజకీయంగా తను వ్యతిరేకించే వారంతా కలిసి ఎన్నికల్లో ఓడించేందుకు చేతులు కలిపారని కల కంటుంటాడు. నిద్ర లేచిన తర్వాత అది నిజమని భ్రమ పడి బట్టలు చించుకుంటాడు. మానసిక దుర్భలత్వం వల్ల వచ్చిన సమస్య ఇది!'' అంటూ వరుస ట్వీట్లతో చంద్రబాబుపై విజయసాయి రెడ్డి విమర్శలకు దిగారు.