విశాఖపట్టణం: టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొండలు, వాగులు, వంకలను విశాఖపట్టణం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.

also read:విశాఖలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు: సాయిబాబా టెంపుల్ వద్ద వెలగపూడి కోసం అమర్‌నాథ్ ఎదురుచూపు

ఆదివారం నాడు ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు  చేశారు.  విశాఖలో ఆయన వెలగబెట్టింది దౌర్జన్యాలు, మద్యం, మాఫియా, భూ దందాలు, జూదమని ఆయన ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి రావడంతో వెలగపూడి ఆగడాలకు చెక్ పడిందన్నారు.  దీంతో రెక్కలు తెగిన వెలగకోడి గిలగిలా కొట్టుకుంటోందన్నారు.  అక్రమ మద్యంపై కేసులు పెట్టిన సమయంలో కూడా ఆయన ఇలా ఓవర్ యాక్షన్ చేశాడని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

 

విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైసీపీ ఎంపీ  విజయసాయిరెడ్డి రెండు రోజుల క్రితం తీవ్ర ఆరోపణలు చేశారు.ఈ ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్పందించారు.

సాయిబాబా ఆలయంలో ప్రమాణానికి తాను సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు. ఆలయంలో ప్రమాణానికి విజయసాయిరెడ్డి రావాలని రామకృష్ణబాబు స్పందించారు. అయితే ఈ సవాల్ కు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ స్పందించారు. విజయసాయిరెడ్డి వస్తేనే తాను ప్రమాణం చేయడానికి వస్తానని వెలగపూడి రామకృష్ణబాబు స్పష్టం చేశారు.