Asianet News TeluguAsianet News Telugu

ముహూర్తం ఫిక్స్ అవ్వలేదు.. కానీ, త్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌: విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు

త్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ తరలిస్తామన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆ సంకేతాలు అందుతున్నాయని చెప్పారు. ముహూర్తం నిర్ణయం కాలేదు కానీ రాజధాని త్వరలో రావడం ఖాయమని విజయసాయి చెప్పారు. 

ysrcp mp vijayasai reddy sensational comments on visakha executive capital ksp
Author
Amaravati, First Published Jun 17, 2021, 5:42 PM IST

త్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ తరలిస్తామన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆ సంకేతాలు అందుతున్నాయని చెప్పారు. ముహూర్తం నిర్ణయం కాలేదు కానీ రాజధాని త్వరలో రావడం ఖాయమని విజయసాయి చెప్పారు. విశాఖ సమగ్ర అభివృద్ధిపై ఆయన గురువారం మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ తదితరులతో సమీక్ష నిర్వహించారు. రూ.3000 కోట్లతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు విజయసాయి తెలిపారు. 

అంతకుముందు ఈ నెల ప్రారంభంలోనూ విజయసాయిరెడ్డి రాజధాని తరలింపుపై మాట్లాడారు. సీఆర్‌డీఏ కేసులకు రాజధాని తరలింపునకు సంబంధం లేదని చెప్పారు. అతి త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తోందని చెప్పారు. త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నుండి పాలన సాగించనున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు.సీఎం ఎక్కడి నుండైనా పాలన సాగించవచ్చన్నారు. గతంలో చంద్రబాబునాయుడు హైద్రాబాద్ నుండి పాలన సాగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.అయితే విశాఖ నుండి ఎఫ్పుడు పాలన ప్రారంభం కానుందో స్పష్టమైన తేదీని చెప్పలేమన్నారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ తరలింపునకు ఏర్పాట్లు జరుగుతాయని ఆయన తెలిపారు

Also Read:సీఆర్‌డీఏ కేసులకు రాజధాని విశాఖకు తరలింపునకు సంబంధం లేదు: విజయసాయిరెడ్డి

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత  మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా, జ్యూడిషీయల్ రాజధానిగా కర్నూల్, లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి కొనసాగుతోందని ఏపీ సీఎం జగన్ గతంలో ప్రకటించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను విపక్షాలు వ్యతిరేకించాయి. రాజధానుల అంశం రాష్ట్రాల  ఇష్టమని కేంద్రం కూడ తేల్చి చెప్పింది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ  రాజధాని గ్రామస్తులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios