ఈసారి కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయం, గణాంకాలతో సహా చెప్పిన విజయసాయిరెడ్డి
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోతారని బల్లగుద్ధి చెబుతున్నారు వైసీపీ రాజ్యసభ్ సభ్యుడు విజయసాయిరెడ్డి. 2004లో చంద్రబాబుకు 70 శాతం ఓట్ షేర్ వచ్చిందని, 2014 నాటికి అది 62.5 శాతానికి పడిపోయిందన్నారు. 2019లో ఇది 55.19 శాతానికి దిగజారిందని.. కేవలం 30,722 ఓట్ల తేడాతోనే చంద్రబాబు గెలిచారని విజయసాయిరెడ్డి తెలిపారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ నేతల కీలక స్థానాలైన కుప్పం, హిందూపురం, మంగళగిరి, ఉరవకొండ, టెక్కలిపై వైసీపీ ఫోకస్ పెట్టింది. వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న జగన్ కుప్పం, మంగళగిరిపై మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి , ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు మంగళగిరి నుంచి బరిలోకి దిగుతున్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్‌ను ఓడించిన వైసీపీ.. ఈసారి అదే సీన్ రిపీట్ చేయాలని చూస్తుండగా, కుప్పంలోనూ వైసీపీ జెండా పాతాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలోనూ వైసీపీ గెలిచిన సంగతి తెలిసిందే. జగన్‌కు తోడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ పావులు కదుపుతున్నారు.
ఇదిలావుండగా.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోతారని బల్లగుద్ధి చెబుతున్నారు వైసీపీ రాజ్యసభ్ సభ్యుడు విజయసాయిరెడ్డి. మంగళవారం ఆయన ఈ మేరకు ట్వీట్ చేస్తూ .. పలు గణాంకాలను వివరించారు. 2004లో చంద్రబాబుకు 70 శాతం ఓట్ షేర్ వచ్చిందని, 2014 నాటికి అది 62.5 శాతానికి పడిపోయిందన్నారు. 2019లో ఇది 55.19 శాతానికి దిగజారిందని.. కేవలం 30,722 ఓట్ల తేడాతోనే చంద్రబాబు గెలిచారని విజయసాయిరెడ్డి తెలిపారు. 2024లో టీడీపీ అధినేత గెలవడం కష్టమేనని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు మరోసారి సీఎం అవుతారనే విషయాన్ని మర్చిపోవాలన్నారు.