Asianet News TeluguAsianet News Telugu

అరెస్ట్ అంటూ సానుభూతి డ్రామాలు: చంద్రబాబుపై విజయసాయి సెటైర్లు

 తనను అరెస్ట్ చేస్తారని  చంద్రబాబు చేసిన కామెంట్స్ పై  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  స్పందించారు.సానుభూతి డ్రామాలు ఆడుతున్నారని  బాబుపై  ఆయన మండిపడ్డారు.

Ysrcp MP  Vijayasai Reddy  Responds on  Chandrababu Comments lns
Author
First Published Sep 7, 2023, 6:45 PM IST

అమరావతి:  తనను అరెస్ట్  చేస్తారని  సానుభూతి డ్రామాలాడుతున్నారని  టీడీపీ చీఫ్ చంద్రబాబుపై  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  విమర్శించారు.తన భార్యను అవమానించారంటూ గతంలో  గుక్కపెట్టి ఏడ్చారని ఆయన  ఎద్దేవా చేశారు.  ఎన్నికల ముందు తనకు ప్రజలంతా  వలయంలా నిలబడి కాపాడుకోవాలని  నాటకాలాడినా  ఎవరూ పట్టించుకోవడం లేదుగా బాబు గారు అంటూ  ఆయన సెటైర్లు వేశారు.

also read:చంద్రబాబుకు భవిష్యత్తు కళ్ల ముందు కన్పిస్తుంది: సజ్జల

 మొన్నటి దాకా ఆంధ్రాను  శ్రీలంకతో పోల్చి శునకానందం పొందారని ఆయన  చంద్రబాబుపై  మండిపడ్డారు.  ఇప్పుడేమో  ఆంధ్రా- తెలంగాణను  ఉత్తర-దక్షిణ కొరియాలంటూ  ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. ఆంధ్రా కిమ్ ను  వ్యాధి బాగా ముదిరిందని చంద్రబాబుపై మండిపడ్డారు.  ఎక్కడైనా సైక్రియాట్రిస్ట్ కు  చూపించుకోవాలని  చెప్పినా వినకుండా  రోడ్లపై తిరుగుతున్నారన్నారు.

 

టీడీపీ చీఫ్ చంద్రబాబుకు  ఐటీ శాఖ షోకాజ్ నోటీసు పంపిందని  హిందూస్థాన్ టైమ్స్  పత్రిక  ఓ కథనం ప్రచురించింది.ఈ కథనంపై  వైసీపీ నేతలు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నాయి. ఐటీ షోకాజ్ నోటీసులపై  చంద్రబాబు ఎందుకు  నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నారు.  నిన్న అనంతపురం జిల్లాలో  పర్యటన సందర్భంగా  చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు  ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి. తనను  అరెస్ట్ చేస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 

ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో  చర్చకు దారి తీశాయి.  గత నాలుగున్నర ఏళ్లుగా వైఎస్ఆర్‌సీపీ అరాచకాలకు పాల్పడుతుందని  చంద్రబాబు ఆరోపించారు. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు.   వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కూడ తనపై  26 విచారణలు చేసినా కూడ  ఒక్క విషయంలో కూడ  ఏమీ నిరూపించలేకపోయారని  చంద్రబాబు గుర్తు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios