ద‌క్షిణాఫ్రికాలో (south africa) విజృంభిస్తోన్న క‌రోనా (coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై (new variant) వైసీపీ (ysrcp) రాజ్యసభ సభ్యుడు విజ‌య‌సాయిరెడ్డి (vijayasai reddy) ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అలాగే  కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అణగారిన బీసీలను గుర్తించేందుకు సామాజిక ఆర్థిక కుల గణన చేయాలని విజయసాయిరెడ్డి సూచించారు.

ద‌క్షిణాఫ్రికాలో (south africa) విజృంభిస్తోన్న క‌రోనా (coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై (new variant) వైసీపీ (ysrcp) రాజ్యసభ సభ్యుడు విజ‌య‌సాయిరెడ్డి (vijayasai reddy) ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఒమిక్రాన్ కేసులు ఉన్న దేశాల నుంచి భారతదేశానికి విమాన రాక‌పోక‌లు జ‌ర‌గ‌కుండా నిషేధం విధించాల‌ని ఆయన కేంద్రాన్ని కోరారు. ఈ విష‌యంలో ఆల‌స్యం చేస్తే భార‌త్‌కు ప్ర‌మాద‌మ‌ని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ద‌క్షిణాఫ్రికా నుంచి నెదర్లాండ్స్ కు వెళ్లిన ఓ విమానంలో 61 మంది ప్రయాణికుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని ఆయ‌న ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ విష‌యం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని విజయసాయిరెడ్డి చెప్పారు. విదేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికులంద‌రికీ క‌రోనా టెస్టులు నిర్వహించాలని, అవ‌స‌ర‌మైతే క్వారంటైన్‌లో ఉంచాల‌ని ఆయ‌న కేంద్ర స‌ర్కారుకి సూచించారు.

ఇకపోతే .. కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని ఆయన కేంద్రాన్ని కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలను (parliament winter session) పురస్కరించుకుని జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... కనీస మద్దతు ధరను 24 పంటలకు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కల్పిస్తున్నారని వెల్లడించారు. అదే పద్ధతిలో దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఇక, ఆహార భద్రతా చట్టం అమలులో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని .. దానిని సరిదిద్దాలని సూచించారు. అణగారిన బీసీలను గుర్తించేందుకు సామాజిక ఆర్థిక కుల గణన చేయాలని విజయసాయిరెడ్డి సూచించారు.

ALso Read:కనీస మద్దతు ధర చట్టం తేవాలి: ఆల్‌ పార్టీ భేటీలో విపక్షాల డిమాండ్

ఇక, మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని కేంద్రాన్ని కోరినట్టు ఆయన తెలిపారు. ఎంపీ సాయిరెడ్డి.. రాష్ట్రానికి సంబంధించిన “దిశ” బిల్లును ఆమోదించాలని విజ్ఞప్తి చేశామన్న విజయసాయిరెడ్డి.. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, చంద్రబాబును (chandrababu) ఎవరు తిట్టలేదని అసెంబ్లీ రికార్డులు చూస్తే తెలుస్తుందన్న విజయసాయిరెడ్డి… టీడీపీ అధినేత చంద్రబాబు ఏడుపు ఒక డ్రామా అంటూ సెటైర్లు వేశారు. ఇక, చంద్రబాబు యాక్షన్ కు రియాక్షన్ తప్పదని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. జనాభా లెక్కలు తీసే బాధ్యత కేంద్రానిదేనన్న సాయిరెడ్డి.. కులాల వారిగా లెక్కలు తీస్తే న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.