Asianet News TeluguAsianet News Telugu

ఆ రోజు హెలికాఫ్టర్‌ ప్లేస్‌ విషయంలో జరిగింది ఇదీ: విజయసాయి క్లారిటీ

ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన రోజున ముఖ్యమంత్రి హెలికాఫ్టర్‌లో ఖాళీ లేదని ఆయన చెప్పారు. సంఘటన దృష్ట్యా ఆరోగ్యశాఖ మంత్రి అక్కడికి వెళ్తే ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో తాను దిగి, ఆళ్లనానిని సీఎం వెంట పంపానని విజయసాయి స్పష్టం చేశారు

ysrcp mp vijaya sai reddy slams opposition parties
Author
Visakhapatnam, First Published May 12, 2020, 3:16 PM IST

రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. వివాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన రోజున ముఖ్యమంత్రి హెలికాఫ్టర్‌లో ఖాళీ లేదని ఆయన చెప్పారు.

సంఘటన దృష్ట్యా ఆరోగ్యశాఖ మంత్రి అక్కడికి వెళ్తే ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో తాను దిగి, ఆళ్లనానిని సీఎం వెంట పంపానని విజయసాయి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని.. అది బహుశా ఎల్లోమీడియాకే  చెందుతుందని ఆయన ఘాటుగా విమర్శించారు.

Also Read:ఏపీలో కరోనా రాక్షస క్రీడ: కొత్తగా 33 కేసులు, మరో మరణం నమోదు

విశాఖ జిల్లాను తాను దత్తత చేసుకున్నానని, అక్కడ ఎలాంటి సమస్య వచ్చినా అండగా ఉంటానని విజయసాయి తేల్చిచెప్పారు. ఘటన జరిగిన పరిసర గ్రామాల్లోని ప్రజలంతా తమ ఇళ్లకు వచ్చేశారని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు ఇవాళో, రేపో స్వస్థలాలకు చేరుకుంటారని విజయసాయి వెల్లడించారు.

ఏదో ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ తీసుకుని దానిని ఎక్స్ పోజ్ చేసి ఇక్కడ నుంచి ప్రజలు వెళ్లిపోతున్నారనే భావన కల్పించడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. ఇక్కడి గ్రామాలలో గ్రామాలలో పశువులకు అవసరమైన పశుగ్రాసం సరఫరా చేస్తామని ఆయన ప్రకటించారు.

ప్రమాదం బారినపడిన గ్రామాల్లో సాధారణ స్థితి వచ్చిందని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దని విజయసాయి ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. 13 వేల టన్నులలో స్టైరిన్ ఉండగా.. 8 వేల టన్నులు ఇవాళ వెళ్లిపోతుందని, మిగిలినదానిని కూడా తరలిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Also Read:మడ అడవుల నరికివేత: జగన్ పై మండిపడ్డ చంద్రబాబు

ఈ ప్రాంతాన్ని సేఫ్ జోన్‌గా, గ్రీన్‌జోన్‌గా చేయాలని సీఎం ఉద్దేశ్యమని విజయసాయి అన్నారు. గ్రామస్తులలో ధైర్యాన్ని నింపేందుకు గాను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇక్కడే బస చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఇక్కడున్న వాతావరణంలో ఎటువంటి రసాయనాలు లేవు అని నిర్ధారణ చేసుకున్నాకే ప్రజలను ఇక్కడికి తీసుకొచ్చామని వెల్లడించారు. ఆయా గ్రామాల్లో మెడికల్ క్యాంపులు, ఫుడ్ క్యాంపులను కూడా ఏర్పాటు చేస్తామని విజయసాయి రెడ్డి చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios