ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 33 కోవిడ్ -19 కేసులు నమోదు కాగా, మరో మరణం రికార్డయింది. దీంతో మరణాల సంఖ్య 46కు చేరుకుంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 33 కేసులు నమోదయ్యాయి. మరో మరణం రికార్డయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2051కి చేరుకుంది. మరణాల సంఖ్య 46కు పెరిగింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గత 24 గంటల్లో 10,730 శాంపిల్స్ ను పరీక్షగా, 33 మందికి కోవిడ్ -19 పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇప్పటి వరకు 1056 మంది వ్యాధి నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 949 ఉంది.

తాజాగా గత 24 గంటల్లో చిత్తూరు పది కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఒక కేసు నమోదైంది. కృష్ణా జిల్లాలో నాలుగు కేసులు నమోదు కాగా, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో 9 చొప్పున కేసుల నమోదయ్యాయి. అనంతపురం, గుంట్ూరు, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

కర్నూలు జిల్లాలో 16 మంది, కృష్ణా జిల్లాలో 14 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. అనంతపురం జిల్లాలో 4గురు, గుంటూరు జిల్లాలో 8 మంది మరణించారు. విశాఖపట్నం జిల్లాలో ఒక్కరు మరణించారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 46కు చేరుకుంది. 

కర్నూలు జిల్లా 584 కేసులతో రాష్ట్రంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుంటూరు జిల్లా 387 కేసులతో రెండో స్థానం ఆక్రమించింది. 346 కేసులు నమోదైన కృష్ణా జిల్లా మూడో స్థానంలో ఉంది. 

జిల్లాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది...

అనంతపురం 115
చిత్తూరు 131
తూర్పు గోదావరి 47
గుంటూరు 387
కడప 97
కృష్ణా 346
కర్నూలు 584
నెల్లూరు 111
ప్రకాశం 63
శ్రీకాకుళం 5
విశాఖపట్నం 66
విజయనగరం 4
పశ్చిమ గోదావరి68

Scroll to load tweet…