ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి. ఆదివారం వరుస ట్వీట్‌లతో సెటైర్లు వేశారు.

‘‘ సైకిల్ బెల్స్, కొబ్బరి చిప్పలు ఎత్తుకుపోయే చిల్లర దొంగలను చేరదీసి పదవులిచ్చినందుకు చంద్రబాబుకు ప్రజలకు చేతిలో పెద్ద శాస్తే జరగింది. రౌడీ షీట్లు మూసేయించినా బుద్ధులు మారవు కదా.. కన్నాలేసే గుణం ఎక్కడికి పోతుంది. ఇంకో 14 నెలలే వారి ఆగడాలు.. తర్వాత అడ్రసు లేకుండా పోతారని విజయసాయి ట్వీట్ చేశారు.

 

 

మరో ట్వీట్‌లో ‘‘ ఇతర ప్రాంతాల్లో చిక్కుబడిన వాళ్లు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు వెసులుబాటు దొరికింది. ప్రవాసంలో ఉన్న తుప్పు... పప్పులకిది చక్కని అవకాశం. లాక్‌డౌన్ సాకులు చెప్పే వీలు కూడా లేదు. వ్యాక్సిన్ వచ్చేదాకా అడుగుపెట్టేది లేదంటే శాశ్వతంగా అక్కడే ఉండి పోవాల్సి వస్తుంది... మీ ఇష్టం అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.