Asianet News TeluguAsianet News Telugu

రాజధాని తరలింపులో కీలక ఘట్టం... విశాఖకు అధికార భాషా సంఘం కార్యాలయం: విజయసాయిరెడ్డి

అధికార భాషా సంఘం కార్యాలయాన్ని తొలిసారిగా విశాఖకు తరలించిన ఘనత ఆ సంస్థ ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కే దక్కుతుందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. యార్లగడ్డ రాసిన ‘‘పదకోశం- మనకోసం’’ పుస్తకావిష్కరణ సభలో విజయసాయి ఈ కామెంట్లు చేశారు

ysrcp mp vijaya sai reddy comments on vizag executive capital ksp
Author
Amaravathi, First Published Jun 18, 2021, 6:25 PM IST

అధికార భాషా సంఘం కార్యాలయాన్ని తొలిసారిగా విశాఖకు తరలించిన ఘనత ఆ సంస్థ ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కే దక్కుతుందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. యార్లగడ్డ రాసిన ‘‘పదకోశం- మనకోసం’’ పుస్తకావిష్కరణ సభలో విజయసాయి ఈ కామెంట్లు చేశారు. తెలుగు భాషకు యార్లగడ్డ విశేషమైన సేవ చేశారని ప్రశంసించారు. అధికార భాషా సంఘం కార్యాలయం విశాఖకు తరలింపు అంశం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని విజయసాయి వ్యాఖ్యానించారు. తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా రావడం వెనుక లక్ష్మీప్రసాద్ ఎంతో కృషి చేశారని ఎంపీ తెలిపారు. 

Also Read:ముహూర్తం ఫిక్స్ అవ్వలేదు.. కానీ, త్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌: విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు

గురువారం కూడా మీడియాతో మాట్లాడిన ఆయన త్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ తరలిస్తామన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆ సంకేతాలు అందుతున్నాయని చెప్పారు. ముహూర్తం నిర్ణయం కాలేదు కానీ రాజధాని త్వరలో రావడం ఖాయమని విజయసాయి చెప్పారు. విశాఖ సమగ్ర అభివృద్ధిపై ఆయన గురువారం మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ తదితరులతో సమీక్ష నిర్వహించారు. రూ.3000 కోట్లతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు విజయసాయి తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios