పంచగ్రామాల సమస్యను పరిష్కరిస్తామన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. బుధవారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దశాబ్ధాలుగా పంచగ్రామాల సమస్య వుందని తెలిపారు. సమస్య పరిస్కరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో వివరంగా చెప్పామని ఆయన గుర్తుచేశారు. 

అశోక్ గజపతి రాజు దొడ్డిదారిన మళ్లీ సింహాచలం దేవస్థానం ఛైర్మన్ అయ్యారని ఆరోపించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. బుధవారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దీనిపై డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్తున్నామని తెలిపారు. హైకోర్టు డివిజన్ బెంచ్‌లో విజయం సాధిస్తామని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అశోక్ గజపతిరాజును అతి త్వరలో ఛైర్మన్ కుర్చీ నుంచి తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

దశాబ్ధాలుగా పంచగ్రామాల సమస్య వుందని తెలిపారు. సమస్య పరిస్కరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో వివరంగా చెప్పామని ఆయన గుర్తుచేశారు. మాన్సాస్ ట్రస్ట్‌ కింద 14 వేల ఎకరాల భూమి వుందని.. ఆ భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని విజయసాయి తెలిపారు.

అలాగే మాన్సాస్ ట్రస్ట్‌లో 14 విద్యాసంస్థలు వున్నాయని.. పదేళ్లుగా ఆ విద్యాసంస్థల్లో ఆడిటింగ్ జరగలేదని ఆయన ఆరోపించారు. ఆడిటింగ్‌లో అవకతవకలు వున్నట్లు తేలితే సీఎం చర్యలు తీసుకుంటారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. సింహాచల భూముల రక్షణకు ప్రహారీగోడ నిర్మిస్తామని ఎంపీ తెలిపారు. బొబ్బిలి, విజయనగరం రాజులు ఇచ్చిన డిక్లరేషన్‌లో లేని భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని విజయసాయి వెల్లడించారు.

Also Read:మాన్సాస్ ట్రస్ట్ వ్యవహరాల్లో జోక్యం చేసుకోలేదు: వెల్లంపల్లి శ్రీనివాసరావు

మాన్సస్ ట్రస్ట్ భూములను కోర్టు అనుమతితోనే విక్రయించాలని ఆయన డిమాండ్ చేశారు. కానీ 115 ఎకరాలను చట్టవిరుద్ధంగా అమ్మేశారని విజయసాయి ఆరోపించారు. కోర్ట్ పర్మిషన్ లేకుండా దొంగ జీవో తీసుకొచ్చి భూములను విక్రయించారని ఆయన మండిపడ్డారు. భూ ఆక్రమణలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తప్పవని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.