Asianet News TeluguAsianet News Telugu

లోకేష్ ద్వారానే ఐటీ గ్రిడ్‌కు సమాచారం: విజయసాయి

ఐటీ శాఖ మంత్రి లోకేష్ ద్వారానే ఐటీ గ్రిడ్‌కు ఏపీ ప్రజల సమాచారం ఐటీ గ్రిడ్‌కు చేరిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రజల సమాచారాన్ని తమ పార్టీ అవసరాలకు ఉపయోగించుకొన్నాడని ఆయన విమర్శించారు. 
 

ysrcp mp viajyasai reddy slams on chandrababu in hyderabad
Author
Hyderabad, First Published Apr 30, 2019, 2:47 PM IST

హైదరాబాద్: ఐటీ శాఖ మంత్రి లోకేష్ ద్వారానే ఐటీ గ్రిడ్‌కు ఏపీ ప్రజల సమాచారం ఐటీ గ్రిడ్‌కు చేరిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రజల సమాచారాన్ని తమ పార్టీ అవసరాలకు ఉపయోగించుకొన్నాడని ఆయన విమర్శించారు. 

మంగళవారం నాడు వైసీపీ కార్యాలయంలో  వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం డెవలప్ చేసిన ఈ ప్రగతి ప్రాజెక్టును ఆధార్‌కు లింక్  చేశారని  ఆయన చెప్పారు.సంక్షేమ పథకాల పేరుతో ఆధార్ డేటాను దొంగలించారని ఆయన ఆరోపించారు.ఆధార్ డేటాను ఈ ప్రగతి నుండి  డౌన్‌లోడ్ చేసుకొని సేవా మిత్రకు ఉపయోగించుకొన్నారని విజయసాయి రెడ్డి వివరించారు.

సేవా మిత్ర యాప్‌ నుండి సేవామిత్ర డేటా బేస్‌‌లోకి డౌన్‌లోడ్ చేశారని ఆయన తెలిపారు.ఏపీకి చెందిన ప్రజల సమాచారాన్ని టీడీపీ తమ ఆధీనంలో పెట్టుకొందని విజయసాయిరెడ్డి  చెప్పారు. 

ఐటీ గ్రిడ్ సంస్థ సేవా మిత్ర యాప్‌ ‌ను డెవలప్ చేసిందన్నారు. సేవా మిత్ర యాప్ ఉంటే ఆ ఫోన్‌లో ఉన్న సమాచారం కూడ  నేరుగా చూసే అవకాశం ఉందన్నారు. అంతేకాదు ఈ ఫోన్లలో  ఉన్న సమాచారాన్ని కూడ నేరుగా డిలీట్ చేసే వెసులుబాటు దక్కుతోందన్నారు.

ప్రతి ఫోన్‌కు సంబంధించిన ఐఎంఈఏ నెంబర్‌ను కూడ సేకరించారన్నారు. ఆయా ఫోన్లలో ఎవరు ఏం మాట్లాడారనే విషయాన్ని కూడ రికార్డు చేసుకొనే వెసులుబాటు ఉందని విజయసాయిరెడ్డి  చెప్పారు.

ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా డేటాను  కన్వర్ట్ చేశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ప్రతి కుటుంబానికి చెందిన సభ్యుల సమాచారాన్ని సేకరించారన్నారు. అంతేకాదు మహిళల సమాచారం ప్రత్యేకించి సేకరించారని  విజయసాయిరెడ్డి చెప్పారు.

ప్రతి టీడీపీ కార్యకర్తకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి సమాచారం అందుబాటులో ఉంటుందని వైసీపీ ఎంపీ చెప్పారు. ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేసే అవకాశం ఉందనే విషయాన్ని తెలుసుకొనే అవకాశం ఉందని విజయసాయి రెడ్డి తెలిపారు.

టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉందని  భావించిన ఇంటికి పదే పదే సర్వేల పేరుతో వెళ్లి ఆ ఇంట్లో ఓట్లను తొలగించాలని కోరుతూ ఫారం-7 ధరఖాస్తు చేశారని విజయసాయి విమర్శించారు.

ఏపీ ప్రజల డేటాను సేకరించిన చంద్రబాబునాయుడు పాకిస్తాన్ లేదా సిరియా లాంటి దేశాలకు విక్రయించే అవకాశం ఉందేమోననే ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఐటీగ్రిడ్ సంస్థ యజమాని ఆశోక్.... చంద్రబాబు, లోకేష్‌లకు బినామీ అని ఆయన ఆరోపించారు. ఐటీ గ్రిడ్ యజమాని ఆశోక్ ఇంకా అజ్ఢాతంలోనే ఉన్నారన్నారు.

ఐటీ గ్రిడ్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు నేతృత్వం వహించిన బాల సుబ్రమణ్యం ఏం తేల్చారని ఆయన ప్రశ్నించారు. ఓటీఎస్ఐ,  అభయ యాప్‌ల ద్వారా

గ్రీన్ ఆర్క్, ఓటీఎస్ఐ అనే రెండు సంస్థలు బాలసుబ్రమణ్యానికి ఉన్నాయన్నారు. రవాణ శాఖకు చెందిన పారదర్శకత లేదన్నారు. అభయ అనే యాప్ ను తయారు చేశారన్నారు. మహిళల రక్షణ కోసం ఈ యాప్‌ను తయారు చేశారన్నారు. విజయవాడ, విశాఖ కేంద్రాల్లో లక్ష ఆటోల్లో పైలెట్ ప్రాజెక్టుగా రూ.138 కోట్లు ఖర్చు చేశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios