ఏపీ సీఎం చంద్రబాబుకు తోడల్లుడు.. అన్న నందమూరి తారకరామారావు పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు దాదాపుగా ఖ‌రారు అయిన‌ట్లు తెలుస్తుంది.కేంద్ర‌మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న సంగ‌తి తెలిసిందే. దివంగ‌త నంద‌మూరి తార‌క‌రామావు కుమార్తె, ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో కేంద్ర‌మంత్రిగా చక్రం తిప్పారు. ప్రస్తుతం 2019 ఎన్నిక ల హడావుడి అప్పుడే మొదలైంది. ముఖ్యంగా ఏపీలో అటు చంద్రబాబు, ఇటు వైఎస్ జగన్‌లు 2019 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. కొందరికి సీట్ల పంపకాలు, టికెట్‌ల హామీలు కూడా ఇచ్చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో దగ్గుబాటి పురందేశ్వ‌రికి విజ‌య‌వాడ ఎంపీ సీటు ఇస్తామ‌న్నహామీ జగన్ నుండి వెళ్లినట్లు తెలుస్తోంది.