ఎల్లుండి స్పీకర్‌తో వైసీపీ ఎంపీల భేటీ, ఉప ఎన్నికలకు నో ఛాన్స్

Ysrcp MP's will meet Loksabha speaker   Sumitra mahajan on June 6
Highlights

రేపు ఢిల్లీకి వైసీపీ ఎంపీలు

అమరావతి: వైసీపీ ఎంపీలు జూన్ 6వ తేదిన ఢిల్లీలో లోక్‌సభ
స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలవనున్నారు. రాజీనామాల
విషయమై వైసీపీ ఎంపీలతో స్పీకర్ సుమిత్రా మహాజన్
చర్చించనున్నారు.

జూన్ 5 లేదా 6వ తేదిన కలవాలని స్పీకర్ కార్యాలయం  
నుండి సమాచారం వచ్చింది. జూన్ 6వ తేదిన స్పీకర్
సుమిత్రా మహాజన్ ను కలవాలని వైసీపీ ఎంపీలు
భావిస్తున్నారు. 

రేపు వైసీపీ ఎంపీలు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళనున్నారు. ఈ
ఏడాది ఏప్రిల్ మాసంలో వైసీపీ ఎంపీలు తమ పదవులకు
రాజీనామాలు చేశారు. 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో  వైసీపీ
ఎంపీలు రాజీనామాలు చేశారు. స్పీకర్ ఫార్మాట్ లోనే
రాజీనామాలు సమర్పించారు. రాజీనామాల విషయమై
ఎంపీలతో చర్చించేందుకు రావాలని వైసీపీ ఎంపీలకు
స్పీకర్ కార్యాలయం నుండి మరోసారి సమాచారం వచ్చింది.


ఈ సమాచారం మేరకు వైసీపీ ఎంపీలు జూన్ 6వ తేది
ఉదయం 11 గంటలకు స్పీకర్ సుమిత్రా మహాజన్ తో వైసీపీ
ఎంపీలు భేటీ కానున్నారు. రాజీనామాల విషయమై ఎంపీలతో
సుమిత్రా మహాజన్ చర్చిస్తారు.  రాజీనామాలను
ఆమోదించుకొంటామని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు.


ఇదిలా ఉంటే ఉప ఎన్నికలు రాకుండానే వైసీపీ ఎంపీలు
రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని టిడిపి చీప్
చంద్రబాబునాయుడు వైసీపీ ఎంపీల తీరును
ఎండగడుతున్నారు.

వైసీపీ ఎంపీల రాజీనామాలను ఒక వేళ జూన్ 6 వ తేదిన
ఆమోదిస్తే  ఎన్నికలను ఆరు మాసాలలోపుగా పూర్తి చేయాలి.
అయితే కొత్త ప్రభుత్వం జూన్  మొదటి వారంలో  కేంద్రంలో
కొలువు తీరాల్సి ఉంది. 

ఈ తరుణంలో ఎన్నికలు జరిగే అవకాశం లేదని  రాజ్యాంగ
నిపుణులు చెబుతున్నారు.


 

loader