Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌లోకి షర్మిల.. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు, ఆ వర్గాలు హస్తం పార్టీ వెంటే : రఘురామ వ్యాఖ్యలు

వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ysrcp mp raghu rama krishnam raju sensational comments on ys sharmila ksp
Author
First Published Jul 28, 2023, 6:55 PM IST | Last Updated Jul 28, 2023, 6:55 PM IST

వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు దీనిపై వార్తలు వెలువడటమే తప్పించి ఎలాంటి ముందడుగు పడటం లేదు. కానీ పుకార్లు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే చాలా ప్రభావం వుంటుందని అభిప్రాయపడ్డారు. వివిధ సర్వేల ఏజెన్సీల నివేదికలను చూస్తే తమ పార్టీకి కష్టాలు తప్పవని రఘురామ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీకి నాలుగు లేదా ఐదు స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. 

ఏపీలో కాంగ్రెస్ కాస్తా వైసీపీగా రూపాంతరం చెందిందని.. సాంప్రదాయంగా కాంగ్రెస్‌కు అండగా నిలిచిన వారు వైసీపీకి వేశారని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. కానీ ఈసారి ఆ పరిస్ధితి లేదని.. ఆరు శాతం మేర ఓట్లు వైసీపీకి నష్టం చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ముస్లింలు వైఎస్‌ను చూసి వైసీపీకి ఓటు వేశారని.. ఇకపై వారు కాంగ్రెస్‌కే వేస్తారని రఘురామ పేర్కొన్నారు. అలాగే వైసీపీకి బలమైన మద్ధతుదారుగా వున్న ఎస్సీ , ఎస్టీల్లోనూ మార్పు వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి వైసీపీకి 40 సీట్లు మాత్రమే రావొచ్చునని.. సజ్జల సైతం ఎన్నికల గురించి మాట్లాడటం లేదని రఘురామ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పొత్తులకు సమయం వుందని ఆయన పేర్కొన్నారు. 

ALso Read: కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ పార్టీ విలీనం పక్కా!.. షర్మిల పోటీ చేసేది ఇక్కడి నుంచే..!!

కాగా.. కాంగ్రెస్‌ పార్టీలో చేరి తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని షర్మిల భావిస్తుండగా.. అయితే  కొందరు నాయకులు మాత్రం ఈ పరిణామాలను వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి పలు కారణాలతోనే కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీన ప్రక్రియ ఆలస్యం అవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నారు. అయితే అటు కాంగ్రెస్ అధిష్టానం.. ఇటు షర్మిల కూడా విలీన ప్రక్రియగా  సుముఖంగా ఉన్నారని చెబుతున్నాయి. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కూడా ఈ డీల్ సెట్ చేసేందుకు తీవ్రంగా  కృషి చేస్తున్నారని.. కాస్తా ఆలస్యమైనప్పటికీ ఇందుకు సంబంధించి ప్రకటన వెలువడుతుందని ఆ వర్గాలు తెలిపాయి. 

అయితే వైఎస్ షర్మిల కాంగ్రెస్‌తో జట్టుకట్టిన పక్షంలో ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే  పోటీ చేసే స్థానాల విషయంలో రెండు  నియోజకవర్గాల పేర్లు ప్రధానంగా  వినిపిస్తున్నాయి. అందులో ఒకటి పాలేరు కాగా.. మరొకటి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం. షర్మిల వైఎస్సార్‌టీపీ ఏర్పాటు చేసినప్పటీ.. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, గ్రేటర్ హైదరాబాద్‌లపై ఫోకస్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచే పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. మరికొద్ది రోజుల్లో పాలేరు పాదయాత్ర చేపట్టనున్నట్టుగా వెల్లడించారు. అక్కడ పార్టీ  కార్యాలయం నిర్మాణం కూడా చేపట్టారు. 

అయితే షర్మిల పాలేరులో నుంచి పోటీ చేసిన పక్షంలో ఆమెకు విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల ఖమ్మం జిల్లాలో మంచి పట్టున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం.. పాలేరు బీఆర్ఎస్‌లో తుమ్మల నాగేశ్వరరావు  వర్సెస్ కందాల ఉపేందర్ రెడ్డి పరిస్థితులు.. అక్కడ స్థానికంగా ఆంధ్ర మూలాలు ఎక్కువ మంది ఉండటం.. వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు.. వంటి అంశాలు షర్మిలకు కలిసివచ్చే అవకాశం ఉంది

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios