MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Corona In AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా క‌ల‌క‌లం.. మ‌ర‌ణాల‌తో అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌భుత్వం.

Corona In AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా క‌ల‌క‌లం.. మ‌ర‌ణాల‌తో అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌భుత్వం.

Corona In AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మరోసారి ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా కడప జిల్లాలో వరుసగా కరోనా కేసులు నమోదవడం, ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటనతో అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 11 2026, 08:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కడపలో కరోనా కేసులు.. వ్యక్తి మృతి
Image Credit : Gemini AI

కడపలో కరోనా కేసులు.. వ్యక్తి మృతి

జిల్లాలో ఇటీవల పలువురికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారించింది. బాధితుల్లో 46 ఏళ్ల వ్యక్తి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరాడు. వైద్య పరీక్షల్లో అతని రెండు ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. మొదట నిమోనియాగా భావించి చికిత్స అందించినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. అనంతరం నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో వైరస్ సోకినట్లు తేలింది. చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. మృతుడికి ఆల్కహాల్ అలవాటు ఉన్నట్లు వైద్య అధికారులు వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కాంటాక్ట్ ట్రేసింగ్, పారిశుధ్య చర్యలు వేగవంతం
Image Credit : Asianet News

కాంటాక్ట్ ట్రేసింగ్, పారిశుధ్య చర్యలు వేగవంతం

కేసులు వెలుగులోకి వచ్చిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బాధితులు నివసించిన ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టారు. బ్లీచింగ్ చల్లడం, శానిటైజేషన్ నిర్వహించడం, ప్రాథమిక, ద్వితీయ కాంటాక్టులను గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం ప్రారంభించారు. కరోనా నిర్ధారణ అయిన కుటుంబాల సభ్యులకు కూడా పరీక్షలు చేసి, అవసరమైతే ఐసోలేషన్‌లో ఉంచే ఏర్పాట్లు చేశారు.

Related Articles

Related image1
వాట్సాప్‌లో లేదా టికెట్ స్క్రీన్‌షాట్ చూపిస్తే చెల్ల‌దు.. ఇండియన్ రైల్వే కీలక హెచ్చరిక
Related image2
Xiaomi 17 Pro Max: ఐఫోన్‌ను షేక్ చేస్తున్న చైనా ఫోన్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఫోన్‌లో లేని కొత్త ఫీచ‌ర్
35
అధికారులకు మంత్రి సవిత కీలక ఆదేశాలు
Image Credit : our own

అధికారులకు మంత్రి సవిత కీలక ఆదేశాలు

కరోనా పరిస్థితిపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత జిల్లా కలెక్టర్ సీహెచ్ శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రవిబాబుతో ఫోన్‌లో సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, ఆసుపత్రుల్లో మాస్కుల వినియోగాన్ని ప్రోత్సహించాలని, జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత లక్షణాలు ఉన్న వారిని వెంటనే గుర్తించి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అవసరమైతే వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. అలాగే అవసరమైన మేరకు కోవిడ్ టీకాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

45
కొత్త వేరియంట్‌పై పూణే ల్యాబ్‌లో పరీక్షలు
Image Credit : our own

కొత్త వేరియంట్‌పై పూణే ల్యాబ్‌లో పరీక్షలు

ప్రస్తుతం నమోదైన కేసులకు కారణమైన కరోనా వేరియంట్ స్వభావాన్ని తెలుసుకునేందుకు శాంపిళ్లను పూణేలోని ప్రత్యేక ప్రయోగశాలకు పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుందా లేదా పరిమిత స్థాయిలోనే ఉంటుందా అనే విషయం రిపోర్టు వచ్చిన తర్వాత స్పష్టమవుతుందని చెప్పారు. ప్రస్తుతం నమోదైన కేసులు మినహా కొత్తగా పెద్ద సంఖ్యలో ఇన్‌ఫెక్షన్లు నమోదు కాలేదని కూడా వెల్లడించారు.

55
ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. కానీ
Image Credit : our own

ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. కానీ

కరోనా కేసులు నమోదవుతున్నాయనే కారణంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, అవసరమైన చోట మాస్క్ ధరించడం, అనారోగ్య లక్షణాలు ఉంటే ఇతరులతో దూరం పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
కరోనా వైరస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Malla Reddy: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను టార్గెట్ చేసిన మ‌ల్లారెడ్డి.. తిరుప‌తిలో చ‌క్రం తిప్పేందుకు పెద్ద స్కెచ్
Recommended image2
Now Playing
ఒకేఒక్కడు సీన్ రిపీట్ | CM Chandrababu Sudden Entry In Panchayat Office | Asianet Telugu
Recommended image3
Now Playing
Ambati Rambabu Pressmeet: ఏపీ కేబినెట్ మీటింగ్పై ప్రెస్ మీట్ లో అంబటి సెటైర్లు
Related Stories
Recommended image1
వాట్సాప్‌లో లేదా టికెట్ స్క్రీన్‌షాట్ చూపిస్తే చెల్ల‌దు.. ఇండియన్ రైల్వే కీలక హెచ్చరిక
Recommended image2
Xiaomi 17 Pro Max: ఐఫోన్‌ను షేక్ చేస్తున్న చైనా ఫోన్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఫోన్‌లో లేని కొత్త ఫీచ‌ర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved