ఎయిర్‌ ఏషీయా స్కాంలో బాబు పాత్రపై విచారణ చేయాలి: మిథున్ రెడ్డి

Ysrcp mp mithun Reddy slams on TDP
Highlights

టిడిపిపై వైసీపీ  ఎంపీ మిథున్ రెడ్డి తీవ్ర విమర్శలు

అమరావతి:ఎయిర్‌ ఏషీయా స్కామ్‌ నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు తమ రాజీనామాల అంశాలపై టిడిపి తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు.
మంగళవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం తాము ఇవాళే రాజీనామాలను చేసినట్టుగా టిడిపి నేతలు మాట్లాడడాన్ని  మిథున్ రెడ్డి తప్పుబట్టారు.

ఎయిర్‌ఏషీయా కుంభకోణంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్రపై విచారణ జరిపించాలని  చెప్పారు.  రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే రాష్ట్రంలో పరిస్థితి మరోలా ఉండేదని మిథున్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఓటుకు నోటుకు కేసులో పట్టుబడిన డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో లోకేష్ చెప్పాలని మిథున్ రెడ్డి ప్రశ్నించారు. 
 

loader