ఏపీ రాజకీయాల్లో కోవర్టుల అంశం ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. తన కోవర్టులను కాంగ్రెస్ పార్టీలోకి పంపించి ఆ పార్టీని నాశనం చేసిన చంద్రబాబు ఇప్పుడు జనసేనపై కన్నేశారని విమర్శించారు. జనసేన పార్టీలోకి కూడా టీడీపీ నాయకులను పంపించి ఆ అధినేత పవన్ కళ్యాణ్ ను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్: ఏపీ రాజకీయాల్లో కోవర్టుల అంశం ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. తన కోవర్టులను కాంగ్రెస్ పార్టీలోకి పంపించి ఆ పార్టీని నాశనం చేసిన చంద్రబాబు ఇప్పుడు జనసేనపై కన్నేశారని విమర్శించారు. జనసేన పార్టీలోకి కూడా టీడీపీ నాయకులను పంపించి ఆ అధినేత పవన్ కళ్యాణ్ ను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు నాయుడు నక్కజిత్తుల రాజకీయం అన్ని వేళలా, అంతటా పనిచేయదని విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఖమ్మంలో గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు టీఆర్‌ఎస్‌లో చేరిపోమంటున్నారని ఆరోపించారు. ఐదు నెలలు ఓపికపడితే చంద్రబాబుని వదిలించుకోవచ్చన్నారు.
ఖమ్మం లో గెలిచిన 2 ఎమ్మెల్యేలను చంద్రబాబే టిఆర్ఎస్ కి ఫిరాయించమన్నారు . తన కోవర్టులను కాంగ్రెస్ లో చేర్పించి నాశనం చేసారు. జనసేన లోకి కోవర్టులను పంపించి పవన్ ను తప్పుదారి పట్టిస్తున్నాడు. చంద్రబాబు నక్కజిత్తుల రాజకీయం అన్ని వేళలా, అంతటా పనిచేయదు. 5 నెలలు వేచి చూద్దాం.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 2, 2019
మరోవైపు రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నలు సంధించారు. ప్రధానిగా రాహుల్ గాంధీకి అంత సీన్ లేదన్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు నుంచి ఎందుకు స్పందన లేదని విమర్శించారు.
రెండు ఎంపీ సీట్లు రాని చంద్రబాబు డిసైడ్ చేసేదేమిటని ప్రశ్నిస్తారా? లేక ఆయన చెప్పే మాయ మాటలకు అందించే మూటలకు మురిసి పోయి సరెండర్ అవుతారా? అంటూ కాంగ్రెస్ ని ప్రశ్నించారు ఎంపీ విజయసాయిరెడ్డి.
రాహుల్ ప్రధాని అభ్యర్థి కాదు, అంత సీన్ లేదన్న నాయుడుబాబు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు నుంచి ఏందుకు స్పందన లేదు? 2 ఎంపీ సీట్లు రాని చంద్రబాబు డిసైడ్ చేసేదేమిటని ప్రశ్నిస్తారా? లేక ఆయన చెప్పే మాయ మాటలకు అందించే మూటలకు మురిసి పోయి సరెండర్ అవుతారా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 2, 2019
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 2, 2019, 4:57 PM IST