Asianet News TeluguAsianet News Telugu

కాకినాడ జీజీహెచ్‌ వద్ద ఉద్రిక్తత.. మార్చురీ గదికి వెళ్తున్న టీడీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణం అనుమానస్పద మృతి నేపథ్యంలో కాకినాడలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. 

YSRCP MLC Uday Bhaskar driver death police stops tdp fact finding committee at kakinada ggh
Author
Kakinada, First Published May 21, 2022, 2:16 PM IST

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణం అనుమానస్పద మృతి నేపథ్యంలో కాకినాడలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. దళిత ప్రజా సంఘాలు, పలు ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో కాకినాడ జీజీహెచ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.  ప్రస్తుతం సుబ్రహ్మణ్యం మృతదేహం ఉన్న కాకినాడు జీజీహెచ్ వద్దకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన నిజ నిర్దరణ బృందం వెళ్లింది. టీడీపీ నాయకులు మార్చురీ గదికి వెళ్లకుండా పోలీసులు అడ్డకుంటున్నారు. ఈ క్రమంలోనే ముందకు వెళ్లకుండా  ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ వెళ్లేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే తోపులాట చోటుచేసుకోవడంతో పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. 

సుబ్రహ్మణ్యం మృతికి సంబంధించి కాకినాడ జీజీహెచ్‌ వద్ద పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. ఇందులో ఒత్తిడి తమపై లేదన్నారు. ఈ కేసులో పోలీసులు, ప్రభుత్వం నిష్పాక్షపాతంగా పనిచేస్తుందన్నారు. తొలుత శవ పంచానామా జరిగి, పోస్టుమార్టమ్ జరిగితేనే కేసు దర్యాప్తు సాగుతుందన్నారు. పోస్టుమార్టమ్‌లో మృతికి గల ప్రాథమిక కారణం తెలుస్తుందన్నారు.  174 కింద అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేశామన్నారు. తొలుత శవ పంచానామాకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు సంతకాలు పెట్టాలన్నారు. పోస్టుమార్టం జరిగేలా సహకరించాలని కోరుతున్నట్టుగా చెప్పారు. వారికి అనుమానాలు ఉంటే తమ వద్ద చెప్పాలని కోరారు. 

ఇక, సుబ్రహ్మణ్యం మృతిపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఆ టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలమేరకు కమిటీని ఏర్పాటు చేసినట్లు  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ కమిటీలో మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద్‌బాబు, పీతల సుజాత, పార్టీ నేతలు ఎమ్మెస్‌ రాజు, పిల్లి మాణిక్యాలరావు సభ్యులుగా ఉన్నారు. 

మరోవైపు ఈ కేసులో అనంత ఉదయభాస్కర్‌ను అరెస్ట్ చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. మృతుడి కుటుంబ సభ్యులను శుక్రవారం ఆయన ఫోన్‌లో పరామర్శించారు. సుబ్రహ్మణ్యం తల్లి, భార్యతో మాట్లాడిన ఆయన... న్యాయం జరిగే వరకూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వారికి హామీ ఇచ్చారు. హత్యపై సీబీఐ విచారణ వేయాలని లోకేశ్‌ డిమాండ్ చేశారు. తమ కొడుకుకు ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ హత్య చేశాడని ఆరోపిస్తున్న పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios