అమరావతి: మాజీమంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై నిప్పులు చెరిగారు తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. ట్విట్టర్లో కామెంట్లు కాదు ప్రజాక్షేత్రంలోకి రావాలంటూ సవాల్ విసిరారు. 

ఎమ్మెల్యేగా ఎలాగూ గెలవలేకపోయావు కనీసం ఎంపీటీసీ, జెడ్పిటీసీగా అయినా పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకో అంటూ సవాల్ విసిరారు. పిచ్చుక గూళ్లు కడతామో, సౌకర్యంగా ఉండే ఇళ్లే కడతామో రాబోయే రోజుల్లో చూద్దువుగానీ అంటూ గృహనిర్మాణ పథకంపై లోకేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. 

రాజధానిలో దండుపాళ్యం దొంగల ముఠాల దోచుకున్న పచ్చనేతలని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రజాధనాన్ని దోచుకున్న ప్రతీ ఒక్కరూ ప్రతీ పైసాకు లెక్క చెప్పాల్సిందేనని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి హెచ్చరించారు.