Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా నదిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులను రెగ్యులేట్ చేయాలి: వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి డిమాండ్

 కృష్ణా నదిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులను రెగ్యేలేట్ చేయాలని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్ది ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగిన మరునాడే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది.

Ysrcp MLA Topudurthi Prakash Reddy demands to regulate telangana irrigation projects on krishna river lns
Author
Amaravathi, First Published Oct 7, 2020, 12:35 PM IST

అమరావతి: కృష్ణా నదిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులను రెగ్యేలేట్ చేయాలని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్ది ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగిన మరునాడే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది.

బుధవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.కృష్ణా జలాలపై సుప్రీంలో కేసును వెనక్కు తీసుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకొందని ఆయన చెప్పారు.  

అపెక్స్ కౌన్సిల్ మినిట్స్ ముఖ్యమని ఆయన చెప్పారు ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ ఏం మాట్లాడినా  దాన్ని  రాజకీయంగానే చూడాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణలో ప్రతిపక్షాలు బాధ్యతగా వ్యవహారించాలని ఆయన సూచించారు.

also read:ఏపీ, తెలంగాణ మధ్య ప్రాజెక్టుల వివాదం: ప్రారంభమైన అపెక్స్ కౌన్సిల్ సమావేశం

కేసీఆర్ -జగన్ లాలూచీ పడ్డారని తెలంగాణలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.రాయలసీమ ప్రాజెక్టులను నింపిన పరిస్థితి ఎప్పుడూ లేదని ఆయన గుర్తు చేశారు.చంద్రబాబునాయుడు బలహీనమైన సీఎంగా ఉండడం ఏపీకి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెట్టిందని ఆయన చెప్పారు.

అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 6వ తేదీన జరిగింది. కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ లు ఈ సమావేశంలో వీడియో కాన్పరెన్స్ ద్వారా పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు తమ తమ వాదనలను విన్పించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios