కడప: కడప జిల్లాలోని మంగపేట బెరైటీస్ పరిధిలోని బాధిత ప్రజలు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు నేతృత్వంలో సోమవారం నాడు ఆందోళన నిర్వహించారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో  వైసీపీ శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్ చేశారు.

మంగపేట బేరైటీస్ విషయంలో  పరిహరం కోసం  బాధితులు ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఈ ఉద్రిక్తత కారణంగా ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా  పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పరిస్థితులు చేజారకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ముందు జాగ్రత్తగా వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్ చేశారు.